Radhe Shyam: ప్రభాస్ రాధేశ్యామ్ కోసం వినూత్నమైన ఐడియా.. ప్రమోషన్స్ కోసం ఇలా..

|

Feb 27, 2022 | 7:00 AM

రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా  నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Radhe Shyam: ప్రభాస్ రాధేశ్యామ్ కోసం వినూత్నమైన ఐడియా.. ప్రమోషన్స్ కోసం ఇలా..
Radhe Shyam
Follow us on

Radhe Shyam: రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా  నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో వినూత్నమైన ఐడియాతో వచ్చారు దర్శక నిర్మాతలు. జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్‌గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ అంటున్నారు మేకర్స్. రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్.

ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేసారు. అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మార్చ్ 11, 2022న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kiara Advani And Siddharth: త్వరలో ఏడడుగులు నడవబోతున్న మరో ప్రేమజంట!.. కియారా, సిద్ధార్థల పెళ్లికి పెద్దల గ్రీన్ సిగ్నల్‌!

Bigg Boss Non-Stop Grand Launch Highlights: గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. మరోసారి అదరగొట్టిన నాగ్

Samyuktha Menon: ఛార్మినార్ వద్ద సందడి చేసిన భీమ్లా నాయక్ హీరోయిన్… వైరల్ అవుతున్న ‘సంయుక్త’ ఫొటోస్..