Akash Puri’s Romantic: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వదిలిన ‘రొమాంటిక్’ ట్రైలర్..

|

Oct 19, 2021 | 4:03 PM

పూరీజగన్నాథ్ తనయుడిగా పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మరి సినిమాలు చేస్తున్నాడు.

Akash Puris  Romantic: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వదిలిన రొమాంటిక్ ట్రైలర్..
Akash Puri Romantic Movie
Follow us on

Akash Puri’s Romantic: పూరీజగన్నాథ్ తనయుడిగా పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన ఈ కుర్రాడు. ఇప్పుడు హీరోగా మరి సినిమాలు చేస్తున్నాడు. ఆకాష్ నటించిన మెహబూబా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి సిద్ధం అయ్యాడు ఆకాష్. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకు పూరి శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ పూరిజగన్నాథ్ అందించారు. ఇక ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. ట్రైలర్‌ను విడుదల చేసిన డార్లింగ్ చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. అందమైన ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే గతంలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని టాక్ వినిపించింది. అంతే కాదు ఓటీటీ నుంచి భారీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని చిత్రయూనిట్ ఇన్ని రోజులు ఆగారు. మొత్తానికి దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!

Heroine Pranitha: మత్తు ఎక్కించే ఫోజుల్లో ఆకట్టుకుంటున్న అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ‘ప్రణీత’ ఫొటోస్…

Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !