Raviteja: స్పెయిన్‏లో సందడి చేస్తున్న రవితేజ అండ్ టీం.. ఎందుకో తెలుసా..

|

Mar 08, 2022 | 7:45 PM

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు.

Raviteja: స్పెయిన్‏లో సందడి చేస్తున్న రవితేజ అండ్ టీం.. ఎందుకో తెలుసా..
Raviteja
Follow us on

మాస్ మాహారాజా రవితేజ (Raviteja) ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ..నూతన డైరెక్టర్ శరత్ మాండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. ఇందులో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రవితేజతోపాటు.. రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ స్పెయిన్ వెళ్లింది. అక్కడ అందమైన లొకెషన్స్‏లో పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఈ సాంగ్స్‌ మూవీకి హైలైట్‌గా నిలుస్తాయని డైరెక్టర్‌ శరత్‌ మండవ తెలిపారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మ‌రికొంత మంది ముఖ్య న‌టీన‌టులు యాక్ట్ చేస్తున్నారు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమానే కాకుండా.. రవితేజ ప్రస్తుతం త్రినాద్ రావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అలాగే టైగర్ నాగేశ్వరరావ్ అనే సినిమా కూడా చేస్తున్నారు.

Also Read: Bala: విడాకులు తీసుకున్న మరో స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు.. షాక్‏లో అభిమానులు..

Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ తాజా ట్వీట్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..

Priyanka Arul Mohan: ప్ర‌తి మ‌హిళా గ‌ర్వ‌ప‌డే సినిమా ఇ.టి.. ప్రియాంక అరుళ్ మోహన్ కామెంట్స్ వైరల్.

Alia Bhatt: హాలీవుడ్‌లో అడుగుపెట్టిన అలియా.. ఏకంగా ఆమెతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్న సీత..