Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నారని, వచ్చే నెలలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అటు విజయ్ దేవర కొండ కానీ, ఇటు రష్మిక కానీ ఎలాంటి అధికారిక ప్రకటనలు ఇవ్వలేదు.

Rashmika Mandanna: వచ్చే నెలలోనే విజయ్ దేవరకొండతో పెళ్లి.. రష్మిక సమాధానమిదే.. వీడియో
Rashmika Mandanna, Vijay Deverakonda

Updated on: Jan 19, 2026 | 9:59 PM

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. గతేడాది వీరు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని రూమర్లు ఉన్నాయి. ఇక వచ్చే నెలలోనే ఈ ప్రేమ పక్షలు పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు తమ ఎంగేజ్మెంట్, పెళ్లి విషయాలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి తోడు ప్రస్తుతం ఎవరి సినిమా పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా రష్మిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది. గతేడాది ది గర్ల్‌ఫ్రెండ్‌తో హిట్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే మైసా అనే మరో లేడీ ఓరియంటెడ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రష్మిక తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తనపై వస్తున్న రూమర్స్‌పైనా స్పందించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో వచ్చే నెలలోనే పెళ్లంటూ వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇవ్వాలని యాంకర్ రష్మికను ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు రష్మిక చాలా తెలివిగా సమాధానం చెప్పుకొచ్చింది. ‘నాలుగేళ్లుగా ఇలాంటి వింటూనే ఉన్నాను. జనం కూడా ఎప్పటి నుంచో ఇదే ప్రశ్న అడుగుతున్నారు.. దీని కోసమే నేను కూడా ఎదురుచూస్తున్నాను. దీనిపై ఎప్పుడు చెప్పాలో అప్పుడే మాట్లాడతాను. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను. అయితేకెమెరా ముందు కాకుండా ఆఫ్ ది రికార్డ్‌లో ఈ విషయం గురించి మాట్లాడతాను’ అని రష్మిక చెప్పింది.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూలో రష్మిక కామెంట్స్.. వీడియో..

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 26న విజయ్‌ దేవరకొండ- రష్మిక పెళ్లి జరగనుందని నెట్టింట వార్తలు వైరలవుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. అయితే దీనిపై కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ‍ఎంగేజ్మెంట్ లాగే పెళ్లి విషయంలోనూ ఈ ప్రేమ పక్షులు సర్‌ప్రైజ్ ఇస్తారేమో వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.