Rashmika Mandanna: అందమైన ప్రేమ కథ ‘సీతారామం’ నుంచి రష్మిక మందన్న లుక్.. ఆకట్టుకట్టుకుంటోన్న పోస్టర్

|

Jul 11, 2022 | 6:24 AM

రష్మిక మందన్న.. ఈ పేరు ఇప్పుడు నాలుగు ఐదు భాషల్లో  బాగా వినిపిస్తోంది. మొన్నటి వరుకు కన్నడ , తెలుగు లో మాత్రమే రష్మిక పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

Rashmika Mandanna: అందమైన ప్రేమ కథ సీతారామం నుంచి రష్మిక మందన్న లుక్.. ఆకట్టుకట్టుకుంటోన్న పోస్టర్
Rashmika
Follow us on

రష్మిక మందన్న(Rashmika Mandanna).. ఈ పేరు ఇప్పుడు నాలుగు ఐదు భాషల్లో  బాగా వినిపిస్తోంది. మొన్నటి వరుకు కన్నడ , తెలుగు లో మాత్రమే రష్మిక పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అప్పటినుంచి ఛలో.. ఛలో అంటూ కంటిన్యూ అవుతోంది. తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడి కేరీర్ కు బాగా ప్లస్ అయ్యింది. దాంతో ఈ అమ్మడికి తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీలోనూ ఆఫర్లు అనుకుంటోంది. ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది ఈ చిన్నది.

ఇక ఈ అమ్మడు నటిస్తున్న సినిమాల్లో సీతారామం ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. మృణాళిని ఠాకూర్ హీరోయిన్.. అందమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో కాశ్మీరీ ముస్లీమ్ యువతిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర పేరు అఫ్రీన్. తాజాగా బక్రీద్ సందర్భంగా.. ఈద్ ఉల్-అధా పేరుతో ఒక ప్రత్యేక పోస్టర్ ని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో హిజాబ్ ధరించిన రష్మిక మందన్న ఈద్ ఉల్-అధా శుభాకాంక్షలతో స్పెషల్ గా కనిపిస్తోంది. అలాగే ఈ మూవీలో అక్కినేని సుమంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి