Rashmika Mandanna: కుక్కపిల్లతో క్రేజీ హీరోయిన్ కయ్యలు.. వైరల్ అవుతున్న వీడియో..

|

Nov 24, 2021 | 5:16 PM

అందాల భామ రష్మీక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

Rashmika Mandanna: కుక్కపిల్లతో క్రేజీ హీరోయిన్ కయ్యలు.. వైరల్ అవుతున్న వీడియో..
Rashmika
Follow us on

Rashmika Mandanna: అందాల భామ రష్మీక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ ఫోటోలు, వీడియాలు, నెట్టింట కోకొల్లలుగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ భామ చిన్న పోస్ట్ షేర్ చేసినా.. అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ తన పెట్ తో అల్లరిచేస్తున్న వీడియోను షేర్ చేసింది. తన కుక్కతో సరదాగా ఆడుకుంటూ ఉన్న వీడియోను పోస్ట్ చేసింది రష్మిక దీనికి “నెక్స్ట్ అవెంజర్స్ సినిమాలో నటులు..” అంటూ రాసుకొచ్చింది. కుక్క పిల్లతో గొడవపడుతూ ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రష్మిక.  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించనుంది రష్మిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రష్మిక పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే తమిళ్ సినిమాల్లోనూ నటిస్తుంది ఈ లక్కీ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేస్తుంది ఈ సుందరి. ఇక సోషల్ మెడియలోను ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన క్యూట్ ఫొటోస్ తోపాటు తన సినిమా అప్డేట్స్ కూడా పంచుకుంటూ ఉంటుంది రష్మిక.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood : ఆ హీరోల సినిమాలకు బిగ్ షాక్.. టాలీవుడ్‌లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.

Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..

Disha Patani: బర్త్ డే పార్టీలో టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేసిన దిశా సోదరి.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..