హీరోయిన్స్ పెళ్లి గురించి నిత్యం రకరకాల వార్తలు, రూమర్స్ మనం వింటూ ఉంటాం.. స్టార్ హీరోయిన్స్ పెళ్లి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వార్తల పై కొంతమంది స్పందిస్తూ.. వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొంతమంది వాటిని అస్సలు పట్టించుకోరు. కానీ ఈ అమ్మడు మాత్రం ఏకంగా పెళ్లి అయిపోయిందని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో దుసుకుపోతుంది ఈ చిన్నది. అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అదేవిధంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిన్నదానికి గతంలో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో రష్మిక ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అది పెక్కి పీటల వరకు వెళ్లదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు స్టార్ట్ హీరోయిన్ గా రాణిస్తుంది. తాజాగా ఈ అమ్మడికి పెళ్ళెప్పుడు అనే ప్రశ్న ఎదురైంది. రీసెంట్ గా రష్మిక బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మూవీ ప్రమోషన్స్ కు వెళ్ళింది.
అక్కడ ఈ అమ్మడికి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దాంతో ఆమె ఫన్నీగా రిప్లే ఇచ్చింది. నా ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. నేను నరుటోను పెళ్లి చేసుకున్నా.. అతనంటే నాకు చాలా ఇష్టం.. నా మనసంతా అతనే ఉన్నాడు అని తెలిపింది. నరుటో అంటే ఎనిమీ సిరీస్‌లోని ఒక పాత్ర. ఆ పాత్ర కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఈ చిన్నది కూడా నరుటో ఫ్యాన్ అని తెలిపింది. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.