
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న స్టార్ నటుల్లో రణ్ బీర్ కపూర్ కూడా ఒకరు. బాలీవుడ్‌లోనే కాదు ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో కూడా ఈ చాక్లెట్ బాయ్ టాప్ 10లో ఉన్నారు. మాస్, క్లాస్.. ఎలాంటి పాత్రలకైనా సూటవుతాడు రణ్ బీర్ కపూర్. అందుకే ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడీ చాక్లెట్ బాయ్. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన నటులలో రణ్ బీర్ కూడా ఒకరు. అతని ఇల్లు, కార్లే కాకుండా, ధరించే వాచీల విలువ కూడా లక్షలు, కోట్లలో ఉంటుంది. ఇటీవల, అతను ఒక కార్యక్రమంలో అలాంటి అరుదైన వాచ్ ధరించి కనిపించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘రామాయణం’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన రణబీర్ కపూర్, నీలిరంగు డ్రెస్, దానికి సరిపోయే వాచ్ ధరించారు. రణ్ బీర్ డ్రెస్‌తో పాటు, అతను ధరించిన వాచ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, అది సాధారణ వాచ్ కాదు, ఒక లిమిటెడ్ ఎడిషన్ వాచ్. కేవలం 50 వాచీలను మాత్రమే తయారు చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. అందులో ఒకటి రణబీర్ కపూర్ వద్ద ఉంది.
రణబీర్ కపూర్ ధరించిన ఈ వాచ్ స్విస్ లగ్జరీ వాచ్ బ్రాండ్ అయిన జాకబ్ & కో వారి ‘ఎపిక్ x షేర్-ఎ-పంజాబ్ ఎడిషన్’ కంపెనీది. ఈ ప్రత్యేక వాచ్ ప్రపంచవ్యాప్తంగా కేవలం యాభై పీసులు మాత్రమే తయారు చేశారు.
దీని అసలైన ప్రత్యేకత దాని డిజైన్‌లో పొందుపరిచిన సాంస్కృతిక చిహ్నాలలో ఉంది. సిక్కు సమాజం అలాగే పంజాబ్ సంప్రదాయానికి ప్రతీకగా ప్రత్యేకంగా ఈ వాచ్ ను డిజైన్ చేశారు. సాంస్కృతిక చిహ్నాలతో పాటు, ఈ వాచ్ అత్యాధునిక మెకానికల్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. భారతదేశంలో జాకబ్ & కో వారి ‘ఎపిక్ x షేర్-ఎ-పంజాబ్ ఎడిషన్’ వాచ్ ధర సుమారు రూ. 35.88 లక్షలు. ఇదిలా ఉండగా, రణబీర్ కపూర్ వద్ద ఇప్పటికే కోట్ల విలువైన పలు లగ్జరీ వాచ్ లు ఉన్నాయి.
ఇక ‘రామాయణం’ విషయానికి వస్తే, ఈ చిత్రం నవంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్, లక్ష్మణుడిగా రవి దూబే, మరియు హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. వీరే కాకుండా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, శోభన, షీబా చద్దా, ఫైసల్ మాలిక్ వంటి స్టార్స్ కూడా వివిధ పాత్రలు పోషిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డిఎన్‌ఇజి’ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్ర మొదటి భాగం 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, రెండవ భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి