AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..

బాహుబలిలో భల్లాల దేవుడి పాత్రలో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రానా.. సినిమాల్లో ఆయన పాత్ర కోసం ఎంతగా కమిట్‌ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మువీలో రానా శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు పొందింది. కావల్సిన మేకోవర్‌ కోసం రానా శారీరకంగా ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు..

అరే ఏమైందీ.. బక్కచిక్కి శల్యమైన టాలీవుడ్ టాప్ హీరో! నెట్టింట ఒక్కటే గుసగుస..
Rana Daggubati
Srilakshmi C
|

Updated on: Aug 03, 2026 | 3:39 PM

Share

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానా మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు రెడీ అయ్యారు. బాహుబలిలో భల్లాల దేవుడి పాత్రలో యావత్ ప్రపంచాన్ని ఊపేసిన రానా.. సినిమాల్లో ఆయన పాత్ర కోసం ఎంతగా కమిట్‌ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మువీలో రాణా శరీరాకృతితో ప్రత్యేక గుర్తింపు పొందారు. కావల్సిన మేకోవర్‌ కోసం రాణా శారీరకంగా ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటారు. అయితే బాహుబలి తర్వాత రానాకు హఠాత్తుగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన ఆహార్యం పూర్తిగా మారిపోయింది. సర్జరీ కోసం యూఎస్‌కి కూడా వెళ్లారు. దీంతో శారీరాకృతిలో మార్పు రావడంతో అప్పటికే ఒప్పుకున్న పలు ప్రాజెక్టులను వదులుకున్నారు. అయితే ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడటంతో మామూలు మనిషయ్యారు. కానీ తాజాగా ఆయన లుక్‌ మళ్లీ అభిమానులను కలవరపెట్టింది. గుర్తుపట్టలేనంతగా కనిపించారు.

కండలు తిరిగిన దేహంతో కనిపించే రానా చిక్కిపోయారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. రానా లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా.. ఈ ఫొటోల్లో చాలా బక్కపలచగా.. సన్నగా.. కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన ఫోటోల్లో ఆయన పూర్తిగా మారిపోయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఎందుకింత సన్నగా మారిపోయారు? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

నిజానికి రానా ప్రస్తుత లుక్ వెనుక ఓ ప్రత్యేకత ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రానా కొత్త ప్రాజెక్ట్‌ ‘జై హనుమాన్’ సినిమా కోసం చేసిన ప్రత్యేక మేకోవర్ ఇందుకు కారణమని సమాచారం. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ మువీలో రానా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నారట. మహాభారతంలో శ్రీకృష్ణుడి శాపం కారణంగా యుగాల తరబడి భూమిపై సంచరిస్తున్న అశ్వద్ధామ పాత్రలో సహజంగా కనిపించేందుకు రాణా తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నారని టాక్‌. అశ్వద్ధామ పాత్రలో వాస్తవికత కనిపించేందుకే రానా ఇలా స్లిమ్ అయినట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. తన పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రానా బరువు తగ్గి ఈ ప్రత్యేక లుక్‌లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక రానా కూడా తన బక్కపలచని శరీరాకృతిపై కూడా స్పందించలేదు. కాగా 2024 సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ను షేకాడించిన హనుమాన్ మువీకి సీక్వెల్‌గా జై హనుమాన్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో చిత్రీకరిస్తున్న ఈ మువీలో కాంతార ఫేం రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రానా అశ్వద్ధామ పాత్రలో కనిపించనున్నట్లు నెట్టింట టాక్.

Follow Us
స్కోర్ బోర్డ్‌పై నెల్సన్ నంబర్ కనిపిస్తే ఈ అంపైర్ ఏం చేసేవాడంటే?
స్కోర్ బోర్డ్‌పై నెల్సన్ నంబర్ కనిపిస్తే ఈ అంపైర్ ఏం చేసేవాడంటే?
గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!
గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!
అధర్మం వైపున కర్ణుడు..? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ
అధర్మం వైపున కర్ణుడు..? విధి చేతిలో ఓడిపోయిన విషాద వీరుడి కథ
వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాటర్లు వీరే
వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాని బ్యాటర్లు వీరే
శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వీటి ధరలు
శ్రావణ మాసం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన వీటి ధరలు
సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే!
సింహ రాశిలో రవి.. ఇక ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే!
ఎరుపు రంగు చూస్తే ఎద్దులు ట్రిగ్గర్ అవుతాయా..?
ఎరుపు రంగు చూస్తే ఎద్దులు ట్రిగ్గర్ అవుతాయా..?
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే
ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. ఆస్తుల విలువ తెలిస్తే
రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం...
రాఖీ పండగను ఎందుకు జరుపుకుంటారు? సనాతన ధర్మంలో రక్షా సూత్రం...
రూ.350కే టోల్ పాస్.. నెల రోజుల పాటు ఎన్నిసార్లు అయినా జర్నీ..
రూ.350కే టోల్ పాస్.. నెల రోజుల పాటు ఎన్నిసార్లు అయినా జర్నీ..