Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులలో నితేష్ తివారీ ఒకరు. ఆయన దర్శకత్వంలో పాన్-ఇండియన్ పౌరాణిక కథా చిత్రంగా రామాయణం రూపొందుతోంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ యశ్ రావణుడిగా కనిపించనున్నాడు.

Ramayana Trailer: దూసుకుపోతున్న రామాయణ ట్రైలర్.. మూడు గంటల్లోనే రికార్డ్ స్థాయిలో వ్యూస్
Ramayan

Updated on: Jul 30, 2026 | 8:14 AM

మోస్ట్ అవైటెడ్ రామాయణ సినిమా ట్రైలర్ విడుదలైంది.. ట్రైలర్ అంతా విజువల్ మాయాజాలమే ఉంది. టీజర్‌లో కొన్ని విజువల్స్ వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ సీరియస్‌గా తీసుకున్నారు మేకర్స్.. కచ్చితంగా ట్రైలర్ అయితే నెక్ట్స్ లెవల్ విజువల్ ఫీస్ట్ ఇచ్చింది.. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి బాగున్నారు.. కానీ ట్రైలర్‌ను డామినేట్ చేసింది మాత్రం కచ్చితంగా రావణుడే.. అంటే యశ్. ఈ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకంగా ఉన్నారనేది ట్రైలర్ చూసాక అర్థమైపోతుంది. అయితే ట్రైలర్ అంతటికీ ఒక్కటే లోటు ఏంటంటే హనుమంతుడి లేని రామాయణ ట్రైలర్ చూపించారు.. కథ అంత దూరం నడిచినా ఒక్క షాట్‌లో కూడా హనుమాన్ కనబడలేదు.. ఈ పాత్రను సన్నీ డియోల్ చేసారు. పార్ట్ 1లో అసలు హనుమంతుడు వస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎక్కడా ప్రయోగాలు చేయలేదు. రామాయణానికి విజువల్స్ అందించారు అంతే..

ఇది కూడా చదవండి : ఏంటీ..! ఈ నటి మేనల్లుడు ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోనా..!! ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. రావణుడిగా యష్ అదరగొట్టాడు. అలాగే రాముడిగా రణబీర్ కపూర్ ఆకట్టుకున్నాడు. ఇక సాయి పల్లవి సీతామాతగా అలరించింది. ఈ ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : అతన్ని భరించడం నా వల్ల కాదు.. పెళ్లయిన నాలుగు నెలలకే భర్తపై నటి షాకింగ్ పోస్ట్..

రామాయణం ట్రైలర్ ను 5 భాషల్లో విడుదల చేశారు. కాగా హిందీలో ఈ ట్రైలర్ కు భారీ వ్యూస్ వచ్చాయి. విడుదలైన మూడు గంటల్లోనే 1.2కు పైగా మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది రామాయణ ట్రైలర్. అలాగే తెలుగు వర్షన్ కూడా భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగు ట్రైలర్ కు 272కే కు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే తమిళ్, మలయాళ, కన్నడ ట్రైలర్స్ కు కూడా భారీగా వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ డైరెక్టర్ నన్ను వద్దు అన్నాడు.. కానీ హీరోయిన్ వల్లే ఇదంతా జరిగింది.. షాకింగ్ విషయం చెప్పిన నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us