
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటించిన సినిమా ‘రామాయణ’. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. టాక్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ రామాయణ సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అలాగే ఓవర్సీస్ లోనూ కళ్లు చెదిరేలా టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రామాయణ సినిమా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ వీకెండ్ లోపు 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మరోవైపు బాంబే హైకోర్టు ఈ సినిమాపై కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. సినిమా హాల్లో రామాయణ సినిమాను అనధికారికంగా వీడియో రికార్డింగ్ చేసి, వాటిని సోషల్ మీడియా లేదా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పంచుకునే వారికి లీగల్ నోటీసులు జారీ చేస్తామని చిత్ర బృందం హెచ్చరించింది. బాంబే హైకోర్టు, నవంబర్ 2, 2026, నవంబర్ 6, 2026 తేదీల నాటి ఉత్తర్వుల ద్వారా, అనుమతి లేకుండా సినిమాను లేదా దానిలోని ఏ భాగాన్నైనా రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఇతర మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడాన్ని నిషేధించినట్లు ఈ నోటీసులో పేర్కొన్నారు. దీని ప్రకారం, అనుమతి లేకుండా చిత్రాన్ని రికార్డ్ చేయడం లేదా ఆన్లైన్లో పంచుకోవడం కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది. అలా చేసిన వారిపై కాపీరైట్ చట్టం 1957, సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, భారత న్యాయ స్మృతి (BNS) 2023, ఐటీ చట్టం 2000 కింద కేసులు పెట్టవచ్చు. ఇది కాకుండా, దీనిని కోర్టు ధిక్కరణగా కూడా పరిగణించవచ్చు.
మరోవైపు ‘రామాయణం’ సినిమాను రికార్డ్ చేయడం, పోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలని చిత్ర నిర్మాతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇప్పటికే సోషల్ మీడియాలో అలాంటి వీడియోలను అప్లోడ్ చేసిన వారు వాటిని వెంటనే తొలగించాలని కోరారు. నియమాలను ఉల్లంఘించే వారిని, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు లీగల్ నోటీస్ లు జారీ చేస్తామని చిత్ర బృందం హెచ్చరించింది.
రామాయణ సినిమాకు దంగల్ ఫేమ్ నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ మైథలాజికల్ మూవీలో కన్నడ స్టార్ యశ్ రావణుడిగా నటించాడు
నమిత్ మల్హోత్రాకు చెందిన ‘ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్’, యష్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’, ‘డీఎన్ఈజీ’ సంస్థలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించాయి. సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, హరీశ్ ఉత్తమన్, ఫైసల్ మాలిక్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, ముకేశ్ తివారి, అనుపమ్ ఖేర్, సౌరబ్ సచ్దేవ్, రవి దూబే, ఆదినాథ్ కొఠారే, నితీశ్ శర్మ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి