
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మేకప్ కంటే సహజత్వానికే ప్రాధాన్యమిస్తూ, సినిమల ఎంపికలోనూ తన దైన దారిలో వెళుతోన్న ఈ బ్యూటీకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. కేవలం అందం, అభినయంతోనే కాదు.. తన వ్యక్తిత్వంతోనూ ప్రేక్షకులు, అభిమానుల మనసులు గెల్చుకుందీ అందాల తార. సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోన్న సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసిందీ లేడీ పవర్ స్టార్. ఇక ఇప్పుడు ‘రామాయణ’ సినిమాతో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది సాయి పల్లవి. సీతమ్మ పాత్రలో ఆమె అందం, అభినయానికి అందరూ ముగ్ధులవుతున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే సాయి పల్లవి లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్టార్ సెలబ్రిటీ అయినా సింపుల్ గా ఉంటుందీ అందాల తార. అలాగే ఆమెకు దైవ చింతన ఎక్కువ. ఇదిలా ఉంటే కెరీర్ మొదటి నుంచే సాయి పల్లవి చేతిలో ఓ రుద్రాక్ష కన్పిస్తుంటుంది. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా ఈ జపమాల న్యాచురల్ బ్యూటీ చేతికి ఉండాల్సిందే. రీసెంట్ గా రామాయణ సినిమా ప్రమోషన్లలోనూ చేతిలో రుద్రాక్ష పట్టుకుని కన్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి. మరి దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
కాగా తన చేతికి ఉన్న రుద్రాక్ష జపమాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది సాయి పల్లవి. ‘నాకు దైవభక్తి ఎక్కువ. మా తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తా. అది నాకు కేవలం ఆభరణం కాదు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే జ్ఞాపకం. మన జీవితంలో కొన్ని వస్తువులకు ప్రత్యేకమైన భావోద్వేగపరమైన విలువ ఉంటుంది. అలాంటిదే ఆ మాల. దీనిని ధరించిన తర్వాతే నాలో ప్రార్థించాలి అన్న కోరిక పుట్టింది. మైండ్ ను పీస్ ఫుల్ గా ఉంచుకోవడానికి నేను ఎక్కువగా మెడిటేషన్ చేస్తాను. అప్పుడు కూడా ఈ రుద్రాక్ష హెల్ప్ అవుతుందట. ఈ రుద్రాక్ష మాల దగ్గర ఉంటే నా ఆలోచనలు కంట్రోల్ గా ఉంటాయి. ఓవర్ థింకింగ్ తగ్గుతుంది’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి