పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఆలోచనా విధానం మారాలి: ఉపాసన కొణిదెల

మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉపాసన తెలుగింటి మహిళగా తన విధులు తాను నిర్వహిస్తూ, ఒక ఎంట్రప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నారు. ఓ వైపు ఫ్యామిలీ, మరో వైపు అపోలో హాస్పిటల్ వైస్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, తన విధులను తాను సక్రమంగా నిర్వహిస్తున్నారు.

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఆలోచనా విధానం మారాలి: ఉపాసన కొణిదెల
Upasana Konidela

Updated on: Nov 16, 2026 | 9:47 AM

పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన బాధ్యతలు ఉన్నప్పటికీ, సమాజం మాత్రం తల్లి, తండ్రి చేసే పనులను వేర్వేరుగా చూస్తోందని రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన కొణిదెల అభిప్రాయపడ్డారు. తండ్రి పిల్లలకు ఆహారం తినిపించినా, డైపర్ మార్చినా గొప్ప విషయంగా ప్రశంసిస్తారని, అదే పనిని తల్లి చేస్తే మాత్రం అది ఆమె రోజువారీ బాధ్యతగానే భావిస్తారని ఆమె అన్నారు. ఈ ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఉపాసన అన్నారు. విశాఖపట్నంలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026లో ఉపాసన కొణిదెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌తో ఆమె సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో సమానత్వం వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు ఉపాసన.

పిల్లల సంరక్షణలో తండ్రి భాగస్వామ్యం కావడాన్ని సమాజం ప్రత్యేకంగా చూడటం సరైన పద్ధతి కాదని ఉపాసన అన్నారు. పిల్లలకు తండ్రి ఆహారం తినిపించినా, డైపర్ మార్చినా చుట్టూ ఉన్నవారు ఎంతో గొప్ప పని చేసినట్లు అభినందిస్తారని పేర్కొన్నారు. అదే పనిని తల్లి చేస్తే రోజువారీ బాధ్యతగా తీసుకుంటారని వివరించారు. తల్లిదండ్రులిద్దరూ పిల్లలను పెంచడంలో సమాన పాత్ర పోషించాలనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని ఆమె ఆకాంక్షించారు. కుటుంబంలో మొదలయ్యే ఆలోచనా విధానమే భవిష్యత్తులో సమాజంపై ప్రభావం చూపుతుందని ఉపాసన అభిప్రాయపడ్డారు. ఇంట్లోనే మహిళలు, పురుషుల మధ్య బాధ్యతల విషయంలో సమానత్వం పాటిస్తేనే ఆఫీసుల్లోనూ ఆ మార్పు కనిపిస్తుందని అన్నారు. ఈ అంశాలను విద్యా విధానంలోనూ భాగం చేయాలని, చిన్నతనం నుంచే పిల్లలకు తల్లిదండ్రులిద్దరి బాధ్యతల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

ముఖ్యంగా తల్లులు కూడా తమ పిల్లలు ఇంటి పనుల్లో లేదా పిల్లల సంరక్షణ చేస్తున్నప్పుడు దాన్ని అసాధారణమైన విషయంగా చూడకూడదని ఆమె పేర్కొన్నారు. తండ్రి పిల్లలను చూసుకోవడం ఎవరికో చేస్తున్న ఉపకారం కాదని, అది ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి మార్పులు ప్రతి ఇంట్లో మొదలైతే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు ఉపాసన. తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాన్ని కూడా ఉపాసన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రామ్ చరణ్ పిల్లలకు ఆహారం తినిపిస్తున్నప్పుడు తనకు ఎంతో ముచ్చటగా అనిపిస్తుందని, అయితే ఇప్పుడు అది ఒక సాధారణ తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనని అర్థం చేసుకున్నానని తెలిపారు. తండ్రి పిల్లలను చూసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన అవసరం లేదని, దాన్ని సహజమైన కుటుంబ బాధ్యతగా స్వీకరించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2023లో కుమార్తె క్లిన్ కారా జన్మించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఈ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చి ముగ్గురు పిల్లల తల్లిదండ్రులయ్యారు. కవలల రాకతో తమ కుటుంబంలో ఆనందం రెట్టింపైందని ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సంతోషాన్ని పంచుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us