Bheem For Ramaraju : యూట్యూబ్​లో సరికొత్త రికార్డు

రాజమౌళి అంటేనే రికార్డుల రారాజు. ఇక ప్రస్తుతం తారక్, చరణ్‌లతో మల్టిస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మరిన్ని రికార్డులు దాసోహం కాకుండా ఉంటాయా.

Bheem For Ramaraju : యూట్యూబ్​లో సరికొత్త రికార్డు

Updated on: Oct 31, 2020 | 8:05 PM

రాజమౌళి అంటేనే రికార్డుల రారాజు. ఇక ప్రస్తుతం తారక్, చరణ్‌లతో మల్టిస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక మరిన్ని రికార్డులు దాసోహం కాకుండా ఉంటాయా. తాజాగా  యూట్యూబ్​లో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది ‘ఆర్ఆర్​ఆర్’​ చిత్ర టీజర్. ఇందులోని రామ్​ చరణ్​ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ‘భీమ్ ఫర్​ రామరాజు’ టీజర్​ అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఘనత దక్కించుకుంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకూ ఈ టీజర్‌ను 33.3 మిలియన్ల మంది అఫిషియల్ యూట్యూబ్‌ ఛానెల్‌లో వీక్షించారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో అల్లూరి సీతారామరాజుగా చెర్రీని పరిచయం చేశారు. దీనికి సినీ ప్రేమికుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

రాజమౌళి ఫ్యాన్ ఇండియా మూవీగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ ను‌ భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కిస్తున్నారు.  ఇందులో చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. అలాగే చెర్రీ సరసన బాలీవుడ్‌ నటి ఆలియా, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ ఆడిపాడనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

 

Also Read :

ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ‘నెపోటిజం’ లొల్లి..సల్మాన్ సీరియస్

ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Loading...
Unable to load recommendations.
Follow Us