
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జైలర్ 2’. సుమారు మూడేళ్ల క్రితం వచ్చి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘జైలర్’ సినిమాకు ఇది సీక్వెల్. మొదటి పార్ట్ ను తెరకెక్కించిన నెల్సన్ కుమారే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన ‘జైలర్ 2’ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీ యాక్షన్, స్టైల్, స్వాగ్ అభిమానులకు తెగ నచ్చేశాయి. ఇప్పటికే జైలర్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 550 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే తమిళంలో 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి సినిమాగా జైలర్ 2 నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ యాక్ట్ ఉన్నారు. రమ్యకృష్ణ, విద్యాబాలన్ మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు, యోగిబాబు, మిర్నా మేనన్, రిత్విక్.. ఇలా ఎంతో మంది వివిధ పాత్రలు పోషించారు.
‘జైలర్ 2’ చిత్రం సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు అంచనా. ఇందులో ప్రధాన నటుల పారితోషికాలు కూడా కలిసి ఉన్నాయి. ఇక ఈ సినిమాకు రజనీకాంత్ రెమ్యునరేషన్‌గా రూ. 110 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే దీంతో పాటు సినిమాకు వచ్చే లాభాల్లోనూ రజనీకి వాటా దక్కనుందని టాక్. ఈ లెక్కన చూస్తే ఓవరాల్ గా తలైవాకు రూ. 180 కోట్ల వరకు అందనున్నట్లు తెలుస్తోంది.
ఇతర నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికం విషయానికి వస్తే. . డైరెక్టర్ నెల్సన్ రూ.35కోట్లు, అనిరుధ్ రూ.20 కోట్లు , మోహన్ లాల్ రూ.15 కోట్లు, శివరాజ్ కుమార్ రూ.8 కోట్లు, విద్యాబాలన్ రూ.6కోట్లు , యస్. జే. సూర్య రూ.3కోట్లు తీసుకోనున్నారని. కాగా బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ జైలర్ లో సర్ ప్రైజింగ్ క్యామియో రోల్ చేశాడు. ఇందుకోసం అతను రూ. 25 కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇక విలన్ గా నటించిన సూరజ్ వెంజారమూడు రూ. కోటి వరకు తీసుకున్నట్లు టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి