బాలయ్య కోసం పవర్‌‌‌‌ఫుల్ డైలాగులు సిద్ధం చేస్తున్న బోయపాటి.. ఫ్యాన్స్‌‌‌‌కు పండగే..

|

Feb 07, 2021 | 5:44 PM

నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌ ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్‌ హిట్...

బాలయ్య కోసం పవర్‌‌‌‌ఫుల్ డైలాగులు సిద్ధం చేస్తున్న బోయపాటి.. ఫ్యాన్స్‌‌‌‌కు పండగే..
Follow us on

నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషనల్‌ ఇదివరకు వచ్చిన రెండు చిత్రాలు సూపర్‌ హిట్‌ కావడంతో ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ అంచనాలకు తగ్గట్లుగానే బోయపాటి ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ బాలయ్య బాబులోని నట విశ్వరూపాన్ని చూపించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా ఈసినిమాలో డైలాగులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య డైలాగ్ చెప్తుంటే.. విలన్ కె కాదు చూస్తున్న ప్రేక్షకులకు కూడా చెమటలు పడతాయ్.. అంత తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటారు. ఇప్పటికే  బిబి 3 నుంచి ప్రోమో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఆ ప్రోమో టీజర్ లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ చూస్తుంటేనే అర్ధమవుతుంది ఈ సినిమాలో మిగిలిన డైలాగులు ఎలా ఉండబోతున్నాయో.. అయితే త్వరలో టీజర్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. ఈ టీజర్ లోకి కూడా అదిరిపోయే డైలాగులు ఉండబోతున్నాయట. బాలయ్య కోసం బోయపాటి పవర్ ఫుల్ డైలాగ్స్ ను రాసుకుంటున్నారట . గత సినిమాలు సింహా, లెజండ్ సినిమాల్లో డైలాగ్ లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ నటిస్తుండగా నటుడు శ్రీకాంత్ ఈ సినిమాతో విలన్ గా మారనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మహేష్ బాబును వదలని వార్నర్.. ‘మహర్షి’ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైరల్..

Hero Ajith Kumar : బైక్ రేసింగ్ నేపథ్యం అజిత్ ‘వాలిమై’.. స్పెయిన్‌‌‌‌‌కు పయనమైన చిత్రయూనిట్..