ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం జరిగింది. అనారోగ్యంతో ఆయన కూతురు, గాయకురాలు భవతరణి కన్నుమూశారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసినట్లు తమిళ మీడియా వర్గాల ద్వారా తెలిసింది. గత కొంతకాలంగా భవతరణి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. తాజాగా పరిస్థితి విషమించడం వల్ల శ్రీలంకలోని ఓ ప్రైవైట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయినా ఫలితం దక్కలేదు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి గురువారం ఆమె కన్నుమూశారు.జనవరి 26 సాయంత్రం ఆమె భౌతికకాయం చెన్నైకి రానున్నట్లు తెలిసింది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రియులు కూడా నెట్టింట్లో ఇళయరాజా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలలుపుతున్నారు
కాగా, భవతారిణి పలు తమిళ చిత్రాల్లో సాంగ్స్ కూడా పాడారు. ఎక్కువగా తన తండ్రి, సోదరుల సంగీత సారథ్యంలోనే ఎక్కువగా పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘భారతి’ సినిమాలోని ‘మయిల్ పోల పొన్ను ఒన్ను’ అనే తమిళ సాంగ్‌కు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందారు సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా కూడా ఉన్నారు.
Shell Shocked! Isaignani Ilayaraja 's daughter and Singer #Bhavatharini (47) passed away in Srilanka this evening! #OmShanti pic.twitter.com/vcw1cevCPB
— Sreedhar Pillai (@sri50) January 25, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.