
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోలలో విక్టరీ వెంకటేశ్ ఒకరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం AK 47 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: సైకో భర్తతో కన్నీళ్ల కాపురం.. భార్యతో బలవంతపు శృంగారం.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఆదర్శ కుటుంబం సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సైతం నటించనున్నట్లు సమాచారం. ఇదివరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన పలు చిత్రాల్లో పూజా హెగ్డే నటించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత గుంటూరు కారం సినిమాలోనూ ఈ అమ్మడు నటించాల్సింది. కానీ అనుహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పూజా హెగ్డే కెరీర్ నెమ్మదిగా స్లో అయ్యింది. ఆమె నటించిన చిత్రాలన్నీ ప్లాప్ కావడం.. అవకాశాలు తగ్గిపోవడం జరిగింది. చాలా కాలంగా వరుస ఆఫర్స్ అందుకుంటున్న పూజా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో మరోసారి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Aadi Movie: ఆది సినిమాలో ఎన్టీఆర్ జోడిగా ఆ హీరోయిన్ చేయాల్సింది.. తనని వెళ్లి అడిగితే ఏం జరిగిందంటే.. డైరెక్టర్ వివి వినాయక్..
ఆదర్శ కుటుంబం సినిమాలో మరో కథానాయిక కోసం పూజా పేరును ఎంపిక చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ శ్రీనిధి కాగా.. పూజా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి క్యూరియాసిటి నెలకొంది. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : అందంగా లేని హీరోని పెట్టి తీయడం వల్లే ఆ సినిమా ప్లాప్ అయ్యింది.. నటుడు రవిబాబు..
ఎక్కువ మంది చదివినవి : Anushka Shetty : ఆ హీరో నాకు చాలా స్పెషల్.. అతడే నాకు గాడ్ ఫాదర్.. నా జీవితాన్ని మార్చేశాడు.. అనుష్క కామెంట్స్..