Sree Leela: టాలీవుడ్‌లో సందడి చేస్తున్న పెళ్లి సందడి భామ.. వరుస ఆఫర్లతో ఫుల్ జోష్‌లో శ్రీలీల

|

Apr 17, 2022 | 4:03 PM

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ శ్రీలీల.తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో అందంతో ఆకట్టుకుంది శ్రీలీల.

Sree Leela: టాలీవుడ్‌లో సందడి చేస్తున్న పెళ్లి సందడి భామ.. వరుస ఆఫర్లతో ఫుల్ జోష్‌లో శ్రీలీల
Sreeleela
Follow us on

పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ శ్రీలీల(Sree Leela).తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన నటనతో అందంతో ఆకట్టుకుంది శ్రీలీల. కన్నడలో పలు సినిమాల్లో నటించిన శ్రీలీలమొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. స్టార్ హీరోల సరసన మంచి పాత్రలు దక్కుతున్నాయి. రెండవ సినిమానే రవితేజ సరసన చేస్తున్న ఈ భామ, ఆ తరువాత వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి సినిమాలను కూడా లైన్లో పెట్టేసింది. అంతేకాదు.. వైష్ణవ్ తేజ్.. నవీన్ పోలిశెట్టి లాంటి క్రేజీ హీరోల సినిమాలకు కమిటైంది ఈ బ్యూటీ.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఈ అమ్మడు ఛాన్స్ దక్కించుకుందని ఆ రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. పూజ చెల్లెలిగా శ్రీలీల కనిపించనుందని అంటున్నారు.

ప్రస్తుతంరవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధమాకా’ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే వారాహి బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు హీరోగా లాంచ్ అవుతున్న సినిమాలో శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకున్నారు. నితిన్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీలో ఈ బ్యూటీ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే యంగ్ హీరో ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’ లో శ్రీ లీల హీరోయిన్ గా ఎంపికైనట్లుతెలుస్తుంది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరో వైపు కన్నడ లో కూడా ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కట్టినట్టు సమాచారం. ఇలా ఈ చిన్నది అక్కడ ఇక్కడ ఫుల్ బిజీగా గడుపుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Viral Photo: ఇతను కళ్లతో మాయ చేస్తాడు.. మాటలతో బూరెలు వండేస్తాడు… ఎవరో గుర్తించారా..?

Soundarya Death Anniversary: చెక్కుచెదరని చిరునవ్వు.. చూడగానే ఆకట్టుకునే నిలువెత్తు రూపం.. నేడు సౌందర్య వర్థంతి

Acharya: మెగాస్టార్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డేట్‌ ఫిక్స్‌.. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారంటే!