Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే

పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే
Og

Updated on: Aug 02, 2025 | 3:22 PM

పవన్ కళ్యాణ్ నటిస్తున్న నయా మూవీ ఓజీ. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఓజీ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను విడుదల చేసిన టీజర్‌ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఇక పవన్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం పేక్షకులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.. హరిహరవీరమల్లు సినిమా తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో ఓ సమురాయ్ లా కనిపించనున్నాడు. అలాగే ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us