
ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పళ్లబురుసు’. దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొత్త సోకు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో సుధాకర్ రెడ్డి రంగురంగుల కళ్ల జోడుతో చాలా కొత్తగా కనిపించారు. అలాగే పాట కూడా చాలా ట్రెండీగా, విజువల్స్ తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లోని లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. గతంలో ‘పేపర్ బాయ్’లో ‘బొంబాయి పోతావా రాజా’ నుంచి పలు హిట్ సాంగ్స్ రాసిన సురేష్ గంగుల ఈ పాటకు తెలంగాణ పల్లెపదాలతో అద్భుతమైన సాహిత్యం అందించారు. అలాగే లవ్ స్టోరీ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సారంగదరియా స్టైల్ లోనే ఇప్పుడు మరోసారి ‘కొత్త సోకు’ అంటూ మాంచి తెలంగాణ జానపదాన్ని అందించారు పవన్ సీహెచ్.
ఇక ‘పళ్లబురుసు’. సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్ , గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. వినూత్న కాన్సెప్ట్, ఆకట్టుకునే ఫస్ట్ లుక్‌తో ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘పళ్ళబురుసు’ నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను విడుదల చేయనున్నారు.
What is Pallaburusu????
The questions end here… and the fun begins 😄👌🏻Presenting the First Look and Title Glimpse of 𝙋𝘼𝙇𝙇𝘼𝘽𝙐𝙍𝙐𝙎𝙐 ⚖️🪥
— https://t.co/sc4FK03CE6Witness a quirky entertainer that promises laughter, chaos & a lot more in Cinemas From AUG 14TH, 2026… pic.twitter.com/QGoZ7mfdZJ
— Annapurna Studios (@AnnapurnaStdios) July 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.