Tollywood: లుంగీలో ఉన్న ఆ మజానే వేరు… నయా ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోలు

| Edited By: Rajeev Rayala

Aug 11, 2023 | 3:22 PM

టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్ మరి. ఆ ట్రెండ్‌ ఏంటంటే.. టాలీవుడ్‌లో లుంగీ హ్యాంగోవర్‌ మళ్లీ మొదలైపోయింది. ఎన్నో స్టైలిష్ అవతారాల్లో కనిపించినా.. ఒక్కసారి లుంగీ లుక్‌లోకి వచ్చిన తర్వాత మన హీరోలు మారిపోతున్న తీరు చూసి అంతా షాక్ అయిపోతున్నారు. తాజాగా గుంటూరు కారం లుక్‌లోనూ మహేష్ ఇలాంటి లుక్‌తోనే కనిపించారు. గతంలోనూ ఇలా మాయ చేసారు మహేష్. మహేష్ ఒక్కరే కాదు.. ఈ మధ్య మన హీరోలందరి స్టైల్ సింబల్ లుంగీ అయిపోయింది. మొన్నామధ్య చిరంజీవి కూడా ఇలాగే మెగా చిందులేసారు.

Tollywood: లుంగీలో ఉన్న ఆ మజానే వేరు... నయా ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోలు
Tollywood
Follow us on

ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వేసినా అమ్మాయిలు చీర కట్టినపుడు వచ్చే అందంతో పోలిస్తే దానిముందు ఏం సరిపోతుంది చెప్పండి..? మరి అలాంటి ఆప్షన్ మన హీరోలకు ఉందా..? ఉంది ఉందండోయ్ అంటున్నారు మన హీరోలు. మీకు చీర అయితే.. మాకు లుంగీ అంటున్నారు. టాలీవుడ్‌లో ఇప్పుడిదే ట్రెండ్ మరి. ఆ ట్రెండ్‌ ఏంటంటే.. టాలీవుడ్‌లో లుంగీ హ్యాంగోవర్‌ మళ్లీ మొదలైపోయింది. ఎన్నో స్టైలిష్ అవతారాల్లో కనిపించినా.. ఒక్కసారి లుంగీ లుక్‌లోకి వచ్చిన తర్వాత మన హీరోలు మారిపోతున్న తీరు చూసి అంతా షాక్ అయిపోతున్నారు. తాజాగా గుంటూరు కారం లుక్‌లోనూ మహేష్ ఇలాంటి లుక్‌తోనే కనిపించారు. గతంలోనూ ఇలా మాయ చేసారు మహేష్. మహేష్ ఒక్కరే కాదు.. ఈ మధ్య మన హీరోలందరి స్టైల్ సింబల్ లుంగీ అయిపోయింది. మొన్నామధ్య చిరంజీవి కూడా ఇలాగే మెగా చిందులేసారు. ఆటకావాలా నుంచి బాస్ పార్టీ వరకు మెగాస్టార్ లుంగీ కడితే స్క్రీన్ షేక్ అయిపోవాల్సిందే.

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో చాలా వరకు లుంగీతోనే కనిపించారు. ఆ సినిమా వచ్చినపుడు అదో స్టైల్ ఐకాన్‌లా మారిపోయింది కూడా. ఇక వీరసింహారెడ్డి, అఖండ సినిమాల్లో బాలయ్య లుంగీలో అలా నడిచొస్తుంటే రాజసం ఉట్టిపడిందంతే. తెలుగు వాడి వేడి ఆ లుక్‌లోనే కనిపించింది.

సీనియర్లు మాత్రమే కాదు.. కుర్ర హీరోలు కూడా లుంగీ లుక్‌కు బాగానే అలవాటు పడిపోయారు. రామ్ చరణ్ మొన్నీమధ్యే సల్మాన్ సినిమాలో లుంగీ డాన్స్ చేసారు. అలాగే డిజే సినిమాలో బన్నీ సినిమా అంతా దాదాపు లుంగీలోనే కనిపించారు. విజయ్ దేవరకొండ, రానా అయితే చాలా కాలం లుంగీకి బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు.

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్, థమన్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.