Devara: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న దేవర.. అక్కడ తారక్ సినిమానే తోపు

|

Sep 10, 2024 | 2:06 PM

మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చాలా పోస్టర్లు , పాటలను విడుదల చేసారు, ఇది చూసిన తర్వాత అభిమానులలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద అప్ డేట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేస్తోంది.

Devara: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న దేవర.. అక్కడ తారక్ సినిమానే తోపు
Devara
Follow us on

రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచవ్యాప్తంగా  అభిమానులను సొంతం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఒకటి. మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చాలా పోస్టర్లు , పాటలను విడుదల చేసారు, ఇది చూసిన తర్వాత అభిమానులలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ పెద్ద అప్ డేట్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుష్ చేస్తోంది. దేవర సినిమా విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది.

ఇది కూడా చదవండి :మొగుడు ముసలోడు.. యవ్వారానికి మరొకడు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా..

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దేవర మూవీ డిజిటల్ హక్కులను రూ. 150 కోట్లకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది, అలాగే ఈ సినిమా మొత్తం రన్‌టైమ్‌ను 3 గంటల 10 నిమిషాలుగా ఖరారు చేశారు మేకర్స్.

ఇది కూడా చదవండి : Chiranjeevi : మెగాస్టార్‌తో ఉన్న ఇతన్ని గుర్తుపట్టారా.? ఇండస్ట్రీనే ఊపేశాడు అతను

అదే సమయంలో దేవర’ అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ కావడంతో సినిమా అడ్వాన్స్ బుకింగ్ లోనే హంగామా సృష్టించింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం USAలో అత్యంత వేగంగా 15,000 టిక్కెట్లను విక్రయించిన ఇండియన్  చిత్రంగా నిలిచింది. తొలిరోజు షోకే 15వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయంటే తొలిరోజు తొలి షో చూడటానికి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. యుఎస్‌లో దేవర ప్రీ-సేల్ కలెక్షన్ ఇప్పటికే మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ‘దేవర’ జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రం. ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి, కొడుకు పాత్రలో కనిపించనున్నాడు.  జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన డ్యూయల్ రోల్ చేస్తున్నాడని క్లారిటీ ఇస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.