Nayanthara: ఆ సినిమాలో నన్ను చెత్తగా చూపించారు.. ఓపెన్ అయిపోయిన నయనతార

ఒకే జానర్​కు స్టిక్ అవ్వకూండా డిఫరెంట్​ రోల్స్​లో నటించి తానేంటో నిరూపించుకుంది నయనతార. అయితే తన కెరీర్​లో ఓ క్యారెక్ట్​లో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం పదండి...

Nayanthara: ఆ సినిమాలో నన్ను చెత్తగా చూపించారు.. ఓపెన్ అయిపోయిన నయనతార
Nayanthara
Follow us

|

Updated on: Jun 21, 2024 | 1:30 PM

లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని.. ఆ స్థాయి సినిమాలతో దూసుకుపోతుంది నయనతార. అటు ఇద్దరు పిల్లలతో ఫ్యామిలీ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. మలయాళం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో నటించి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సెట్ చేసుకుంది. అగ్రహీరోలు అందరి సరసన ఆడిపాడింది.  షారుక్​- అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి తన మార్క్ చూపించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ.. డిఫరెంట్​ రోల్స్ చేస్తూ తానేంటో నిరూపించుకుంది. అయితే తన కెరీర్​లో ఓ క్యారెక్ట్​లో నటించినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.

సూర్య  హీరోగా చేసిన ‘గజినీ’ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో అసిన్​ మెయిన్ హీరోయిన్‌ కాగా.. నయన్​ కూడా కీలక పాత్రలో కనిపించింది. చిత్ర అనే మెడికల్ స్టూడెంట్​ పాత్రలో యాక్ట్ చేసింది. అయితే ఆ రోల్ త‌న సినీ కెరీర్​లోనే అత్యంత బ్యాడ్ ఎంపిక‌ అంటూ కామెంట్స్ చేసింది. తాను ఇప్పటివరకు నటించిన మూవీస్ మొత్తంలో ‘గజిని’లో నటించినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ సినిమాలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా షూట్ చేయలేదని చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని… దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్​గా భావించానట్లు తెలిపింది

ఇక నయన్​ చివరిగా ‘అన్నపురణి’ అనే లేడీ ఓరియెంటడ్ సినిమాలో కనిపించింది. నయ‌న్ 75గా తెరకెక్కిన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది.  ప్రస్తుతం యశ్​ ‘టాక్సిక్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. దీంతో పాటు మలయాళంలో నివిన్ పౌలీతో ఓ సినిమాకు సైన్​ చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్​ డ్రామాగా తెరెకెక్కుతున్న ‘టెస్ట్’లోనూ కీ రోల్ చేస్తోంది. అంతే కాకుండా’మనగట్టి సిన్స్ 1960’ అనే సినిమాలోనూ నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.