శ్రీలీలకు బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? ఊహించలేరు
TV9 Telugu
30 June 2024
పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శ్రీలీల. రవితేజతో కలిసి ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకుందీ అందాల తార.
ఆ మధ్యన వరుస పరాజయాలతో కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న శ్రీలీల ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ సత్తా చాటడానికి రెడీ అవుతోందని టాక్.
తమిళంలో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ద్వారా శ్రీలీల ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలీల సినిమా ఇండస్ట్రీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది
ముఖ్యంగా కోలీవుడ్‌లో మీకు నచ్చిన నటి ఎవరన్న ప్రశ్నకు నయనతార అంటే ఎంతో ఇష్టం అని సమాధానమిచ్చింది శ్రీలీల.
ప్రస్తుతం శ్రీలీల పవన్ కల్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి
ఇక్కడ క్లిక్ చేయండి..