ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ దూసుకుపోతుంది. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతోంది ఈ సరికొత్త సింగింగ్ షో.. ఇప్పటికే తెలుగు ఇండియన్ ఐడల్ విజయవంతంగా రెండు సీజన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 3 ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ పై ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి సింగర్స్ ను ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ పై సందడి చేశారు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3కు హాజరయ్యాడు.
అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 స్టేజ్ పై నాని ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నాని తన లేటెస్ట్ మూవీ ‘సరిపోద శనివారం’నుంచి తనకు ఇష్టమైన సాంగ్ ట్రాక్‌ను పరిచయం చేశాడు. ఆ సాంగ్ పాడింది ఎవరో కాదు. ప్రముఖ సింగర్ కార్తీక్. ఇంకా విడుదల చేయని “అనుకుందే జరిగిందా” పాటను లైవ్‌లో పాడి వినిపించారు కార్తీక్. అలాగే స్టేజ్ పై కార్తీక్, నాని ఈ పాటకు స్టెప్పులేశారు. నాని కార్తీక్‌తో కలిసి అంటు ”అనుకుందే జరిగిందా..” సాంగ్ పాడటమే కాకుండా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో స్టేజ్ పై సందడి చేశారు.
మ్యూజికల్ హైలైట్‌తో పాటు, నాని ‘సరిపోద శనివారం’ గురించి ఆసక్తికరమైన వివరాలను తెలిపాడు. అలాగే స్క్రిప్ట్‌లో తనను ఆకర్షించిన విషయాన్ని పంచుకున్నాడు నాని. అలాగే హోస్ట్ శ్రీరామ్ చంద్ర నాని మ్యారేజ్ లైఫ్ గురించి అడిగాడు. అప్పుడు నాని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తన భార్య గురించి నాని చాలా గొప్పగా చెప్పారు. ఈ ఆసక్తికర ఎపిసోడ్ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ఆహాలో చూడాల్సిందే..
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..