కత్తి పట్టిన సింహంలా ఉన్నాడు..రూలర్‌గా బాలయ్య
నందమూరి బాలకృష్ణ..తెలుగు చలన చిత్ర చరిత్రలో లార్జెర్దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ముందుంటారు. అన్న ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..100 సినిమాలను దాటి విజయయాత్ర కొనసాగిస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ క్యాన్సర్ హస్పటల్ ఛైర్మన్‌గా, మరోవైపు స్టార్ హీరోగా బాలయ్య విభిన్న పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటసింహం కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఏ రేంజ్లో మేకోవర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
నందమూరి బాలకృష్ణ..తెలుగు చలన చిత్ర చరిత్రలో లార్జెర్దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ముందుంటారు. అన్న ఎన్టీఆర్ నటవారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..100 సినిమాలను దాటి విజయయాత్ర కొనసాగిస్తున్నారు. అటు ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ క్యాన్సర్ హస్పటల్ ఛైర్మన్‌గా, మరోవైపు స్టార్ హీరోగా బాలయ్య విభిన్న పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం నటసింహం కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో 105వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఏ రేంజ్లో మేకోవర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దసరా సందర్భంగా రిలీజైన బాలయ్య నయా లుక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. కాకపోతే పూర్తిగా క్లాస్ లుక్ ఉండటంతో నందమూరి డై హార్డ్ ఫ్యాన్స్ కాస్త చిన్నబుచ్చుకున్నారు.
కానీ దీపావళి సందర్భంగా రిలీజైన తాజా లుక్‌తో మాస్ ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు. బాలయ్య కత్తిపట్టిన కొదమసింహంలా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్టోరీపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రూమర్స్ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటాడని… ఆ తర్వాత గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది కథాశంగా తెలుస్తోంది. కాగా ఇప్పటికే సర్కులేట్ అవుతోన్న ‘రూలర్’ నే సినిమా టైటిల్ కన్ఫార్మ్ చేశారు.ఇందులో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ ‘ధర్మ’ అనే పాత్రలో కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ స్వరాలు సమకూరుస్తున్నారు. సి.కె. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు. గతంలో బాలయ్య, కే ఎస్ రవికుమార్ కాంబోలో వచ్చిన ‘జైసింహా’ మంచి విజయాన్ని అందుకుంది. మరి ‘రూలర్’ ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.
Here is the First look of #NandamuriBalakrishna as #Dharma From #Ruler ?
Worlwide release on December 20th!#RulerOnDec20 #HappyDiwali pic.twitter.com/NeMAThuI1p
— C Kalyan (@ProducerCKalyan) October 26, 2019