ఆ సీన్ నేను ఎందుకు ఒప్పుకున్నానో.. ఎలా చేశానో.! ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య

ఆ సీన్ నేను ఎందుకు ఒప్పుకున్నానో.. ఎలా చేశానో.! ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది
Balakrishna

Updated on: Aug 04, 2026 | 8:44 AM

నటసింహం నందమూరి బాలకృష్ణను ఇష్టపడని వారు ఉండరు. సినిమాల్లో హీరోగానే కాదు ఆయన వ్యక్తిత్వం, నిజాయితీ, మంచి మనసు, నిర్మొహమాటమైన మాట తీరుతో అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకుంటారు బాలయ్య. ఆయనను చాలామంది ఓపెన్ బుక్ గా అభివర్ణిస్తారు, ఎందుకంటే ఆయన మనసులో ఏముంటే అది కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తారు. కొందరికి ఆయన మాట కటువుగా అనిపించినా, ఆయనలో కల్మషం లేని స్వచ్ఛమైన మనిషి ఉన్నాడన్నది అందరి అభిప్రాయం. ఆయన సన్నిహితులు, సినీ ప్రముఖులు దీని గురించి చెప్తూనే ఉంటారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్‌లో పీక్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. ఒకవైపు విజయవంతమైన చిత్రాలతో కథానాయకుడిగా అలరిస్తూనే, మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ తన కెరీర్, వ్యక్తిగత అలవాట్లపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఇది కూడా చదివేసేయండి : అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లాంటి స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఒక్క హిట్ కూడా లేదు.. ఇప్పుడు ఇలా

ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆయన నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలోని రైలు సీన్‌పై ఆయన చేసిన సరదా కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ సన్నివేశంలో బాలయ్య తొడగొట్టగానే రైలు వెనక్కి వెళ్తుంది. ఈ సీన్‌పై మాట్లాడుతూ, “తొడగొడితే రైలు వెనక్కి వెళ్లడం ఏంటి.?” అని కొందరు తెలిసిన వాళ్లు తనను అడిగినప్పుడు కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుందని బాలయ్య నవ్వుతూ చెప్పారు. షూటింగ్ సమయంలో ఆ పాత్ర మూడ్‌లో ఉన్నప్పుడు, ఆ వాతావరణంలో అది సరిగానే అనిపించిందని, అయితే ఆ తర్వాత ప్రేక్షకుల స్పందన చూసినప్పుడు “అసలు ఇది ఎలా చేశాం?” అని ఆశ్చర్యం కలిగిందని ఆయన అన్నారు. “అసలు రైటర్స్ ఎందుకు అలా రాశారో, నేను ఎందుకు ఒప్పుకున్నానో, దర్శకుడు ఎలా తీశాడో ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది” అని బాలకృష్ణ అన్నారు.

ఇది కూడా చదివేసేయండి : సూపర్ స్టార్ కృష్ణ కాలర్ పట్టుకున్న హీరో.. కటౌట్లు తగలబెట్టి , థియేటర్లపై దాడి చేసిన అభిమానులు

ప్రస్తుత చిత్రాల్లో డైలాగులు, మేనరిజమ్స్ లో సహజత్వం వైపు మొగ్గు చూపుతున్నామని, అయితే తన డైలాగ్ లు ఎప్పుడూ అర్థవంతంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు, బాలకృష్ణ తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా ప్రస్తావించారు. తన ప్రత్యేకమైన గొంతు కోసం పొద్దున్నే లేవగానే చుట్ట కాల్చే అలవాటు ఉందని చెప్పారు. ఉదయం మూడన్నర గంటలకు నిద్ర లేవగానే చుట్టతోనే తన రోజు ప్రారంభం అవుతుందని తెలిపారు. అలాగే తనకు టీ అలవాటు ఉందని, ముఖ్యంగా సాయంత్రం నాలుగున్నర గంటలకు ఒక టీ తప్పనిసరి అని, కాఫీ అలవాటు లేదని బాలకృష్ణ పేర్కొన్నారు. అలాగే తాను చెన్నైలో పుట్టానని, తమిళనాడు తన పుట్టిన ఊరు అని, అయితే ఆంధ్రా నాడు తన జీవనాడు అని తెలిపారు. పది మందిని మీడియా ద్వారా లేదా సాహిత్యపరంగా ఎంటర్టైన్ చేయడం తనకి ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదివేసేయండి : ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్‌లో దగ్గరుండి మరీ చూసేవారట

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us