Namitha: అప్పుడు ఫ్యాన్స్ గుడికట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.. పాపం నమిత

|

Aug 26, 2024 | 2:09 PM

ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నమిత. ఆతర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో తన అందంతో ఆకట్టుకుంది. అలాగే ఈ చిన్నది తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకులు ఏకంగా నమిత గుడి కూడా కట్టేశారు.

Namitha: అప్పుడు ఫ్యాన్స్ గుడికట్టారు.. ఇప్పుడు గుడిలోకి రానివ్వలేదు.. పాపం నమిత
Namitha
Follow us on

ఒకప్పుడు తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది హీరోయిన్ నమిత. ఈ బ్యూటీ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నమిత. ఆతర్వాత వెంకటేష్ హీరోగా నటించిన జెమిని సినిమాతో తన అందంతో ఆకట్టుకుంది. అలాగే ఈ చిన్నది తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అక్కడి ప్రేక్షకులు ఏకంగా నమిత గుడి కూడా కట్టేశారు. ఇక ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటోంది. అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాలో మెరిసింది.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తోన్న నమిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా నమితకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమెను ఓ దేవాలయంలోకి అనుమతించలేదు. అలాగే దేవాలయ సిబ్బంది ఆమెతో అమర్యాదకరంగా వ్యవహరించారని ఆమె తెలిపింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ గా మరి చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆమె మాట్లాడుతూ.. ‘కృష్ణాష్టమి అవ్వడంతో నేను నా కుటుంబంతో కలిసి మీనాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్లా.. అక్కడ నాకు ఓ ఊహించని సంఘటన ఎదురైంది.నన్ను ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆపేశారు. అలాగే వాళ్ళు నన్ను కొన్ని సర్టిఫికెట్స్‌ చూపించమన్నారు. దాంతో నేను షాక్ అయ్యా.. వాళ్ళు నన్ను అలా ఆపడం, సర్టిఫికెట్స్‌ చూపించమనడం నన్ను చాలా బాధపెట్టింది. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రముఖ ఆలయాలకు తాను వెళ్ళాను ఎప్పుడు ఇలా జరగలేదు అని తెలిపింది నమిత. తనతో అమర్యాదగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరకుంటున్నా అని చెప్పుకొచ్చింది నమిత. అయితే నమిత కామెంట్స్ పై ఆలయ అధికారులు స్పందించారు. నమితతో ఎవ్వరూ అలా మాట్లాడలేదు అని తెలిపారు. ఆలయ నియమాల ప్రకారమే ఆమెతో మాట్లాడమని పై అధికారులు చెప్పడంతో ఆమెను కొంత సమయం ఆపేశామని ఆతర్వాత ఆలయంలోకి అనుమతించమని తెలిపారు ఆలయ అధికారులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.