Ayesha Takia: నాగార్జున ‘సూపర్’ మూవీ హీరోయిన్ అయేషా గుర్తుందా.. ? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..

|

Apr 10, 2024 | 6:36 PM

2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుష్క శెట్టి కథానాయికగా పరిచయమయ్యింది. అదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అయేషా టాకియా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ పరిశ్రమకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది. ఈరోజు అయేషా టాకియ పుట్టినరోజు.

Ayesha Takia: నాగార్జున సూపర్ మూవీ హీరోయిన్ అయేషా గుర్తుందా.. ? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..
Ayesha Takia
Follow us on

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా సూపర్. 2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అనుష్క శెట్టి కథానాయికగా పరిచయమయ్యింది. అదే సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అయేషా టాకియా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత తెలుగు, హిందీలో అనేక చిత్రాల్లో నటించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ పరిశ్రమకు, పబ్లిసిటీకి దూరంగా ఉంటుంది. ఈరోజు అయేషా టాకియ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఈ క్రమంలోనే ఇన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అయేషా.. ప్రస్తుతం ఏం చేస్తుంది ?.. తన ఫ్యామిలీ ఏంటీ ? అంటూ సెర్చింగ్ స్టార్ట్ చేసారు ఫ్యాన్స్. అయితే అయేషా గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా.

2004లో ‘టార్జాన్ ది వండర్ కార్’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమెను టార్జాన్ గర్ల్ అని పిలుస్తుంటారు. ఆ తర్వాత హిందీలో ‘షాదీ సే పెహ్లే’, ‘షాదీ నెం. 1’, ‘యు హోతా తో క్యా హోతా’, ‘సలామ్-ఎ-ఇష్క్’, ‘డోర్ అండ్ ఫూల్’ చిత్రాల్లో నటించింది. తక్కువ సమయంలోనే అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలతో నటించింది. నాగార్జున, సల్మాన్ ఖాన్ వంటి హీరోస్ సరసన కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2009లో రాజకీయ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

చాలాకాలంగా పబ్లిసిటీ దూరంగా ఉన్న అయేషా.. ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. తన కుమారుడితో కలిసి కనిపించిన అయోషా ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. దీంతో తన ఇన్ స్టా వేదికగా ట్రోలర్స్, విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తన లుక్స్ గురించి కామెంట్స్ చేయకుండా ఉండాలని.. తనకు సినిమాల్లో నటించాలని.. మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదని తెలిపింది. ప్రస్తుతం అయేషా తన ఫ్యామిలీతో బిజీగా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.