ఇటీవలే ధూత వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు యువసామ్రాట్ నాగచైతన్య. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో జర్నలిస్ట్ పాత్రలో కనిపించి మరోసారి ప్రశంసలు అందుకున్నాడు చైతూ.. ప్రస్తుతం డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నాడు. మత్య్సకారుల జీవితం ఆధారంగా ఈ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతూ ఓ మత్స్యకారుడిగా కనిపించనున్నారు. ఇందులో చైతూ జోడిగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం చైతూ తనను చాలా మార్చుకున్నాడు. జాలరిగా కనిపించేందుకు రగ్డ్ లుక్ లోకి మారిపోయారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కర్ణాటక, ఉడిపిలోని మల్పే పోర్టులో జరుగుతుంది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి చైతన్యకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అందులో చైతూ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. పొడవాటి జుట్టు, మందపాటి గడ్డం, పెద్ద బొట్టుతో డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని లుక్‌లో చైతూ ఉన్నాడు. దీంతో ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇలా రగ్డ్ ఊరమాస్ లుక్‌లో చైతూ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తండేల్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
#Tandel Shooting Start #NagaChaitanya Mass Entry 🔥🔥 pic.twitter.com/nVVengRFZA
— Muddana Prasad Babu (@NagPrasad9) December 20, 2023
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొంతమంది మత్య్సకారులు ఉపాధి కోసం 2018లో గుజరాత్ వెళఅలారు. అక్కడ ఒక కంపెనీ తరుపున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే అనుహ్యాంగా వారు పాకిస్థాన్ జల్లాలోకి వెళ్లిపోయారు. దీంతో దాదాపు 22 మంది మత్య్సకారులను పాకిస్తాన్ సెక్యూరిటీ ఏజెన్సీ బంధించి జైలుకు పంపించింది. ఆ తర్వాత అప్పటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వారిని విడిపించారు. ఇప్పుడు ఆ ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందూ మోండేటి.
#Thandel all set to sail ! Special thanks to @VenkyMama @iamnagarjuna for being my strength always ! @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP #AlluAravind #BunnyVas @_riyazchowdary @Shamdatdop @NavinNooli @KarthikTheeda @bhanu_pratapa @viswanathart @GeethaArts pic.twitter.com/VAq985yvrM
— chaitanya akkineni (@chay_akkineni) December 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.