Naga Chaitanya: “ఆ విషయంలో నార్త్‌తో పోల్చుకుంటే సౌత్ చాలా బెస్ట్”.. నాగచైతన్య సంచలన కామెంట్స్

|

Aug 22, 2022 | 5:48 PM

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

Naga Chaitanya: ఆ విషయంలో నార్త్‌తో పోల్చుకుంటే సౌత్ చాలా బెస్ట్.. నాగచైతన్య సంచలన కామెంట్స్
Naga Chaitanya
Follow us on

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య(Naga Chaitanya)నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో చైతూ కీలక పాత్రలో నటించి మెప్పించారు. చై ఈ సినిమాలో బోడి బాలరాజు పాత్రలో నటించి ప్రేక్షకుల మన్నలను అందుకున్నాడు. తన నటనతో తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు చైతన్య. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు బాయ్ కాట్ సెగ తగిలింది. దాంతో ఈ సినిమా పై నెగిటివిటీ ఎక్కువై సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించింది. ఇదిలా ఉంటే చై ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రిలీజ్ కు ముందు కూడా వరుస ఇంటర్వ్యూలతో గడిపేసిన చై.. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నాడు.

తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇక ఇంట్రవ్యూలో చైతూకి నేపాటిజం గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. నార్త్ తో పోల్చుకుంటే సౌత్ లో నేపాటిజం పెద్దగా కనిపించదని అన్నాడు చైతూ.. మా తాత, మా నాన్న ఇద్దరూ హీరోలే.. చిన్న నాటి నుంచి వాళ్ళను చూస్తూ పెరిగాను. వారి ప్రభావం నా పై ఖచ్చితంగా పడుతుంది కదా.. నాకు హీరో అవ్వాలన్న ఆసక్తి ఉంది. వాళ్ళను స్ఫూర్తిగాగా తీసుకొని హీరో అయ్యాను. ఇప్పుడు నా పని నేను చేసుకుంటూపోతున్నా.. అని చెప్పుకొచ్చారు చైతన్య. అలాగే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరో సినిమా.. నా సినిమా ఒకే రోజు రిలీజ్ అయితే.. ఆయన సినిమా 100 కోట్లు వసూల్ చేస్తే.. నా సినిమాకు 10 కోట్లే వస్తే.. అందరూ ఆయననే ప్రశంసిస్తారు.. దర్శక  నిర్మాత ముందు ఆయన దగ్గరకే వెళ్తారు. అంతే కానీ నేను స్టార్ హీరో కొడుకునని నా దగ్గరకు రారు అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి