Ravi Basrur: కొలిమి నుంచి పాన్ ఇండియా లెవల్‌కు.. సాయం చేసిన వ్యక్తి పేరే తన పేరుగా

|

Jan 06, 2024 | 7:01 PM

కన్నడ హీరో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి రవి అందించిన సంగీతం కూడా ఒక కారణం, ముఖ్యంగా ఆయన హీరో ఎలివేషన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. కేజీఎఫ్ 1,2 సినిమాలకు రవి బస్రుర్ సంగీతం అందించారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సంచలన విజయం సాధించిన సలార్ సినిమాకు కూడా రవి బస్రుర్ నే సంగీతం అందించారు. సలార్ దెబ్బకు రవి కోసం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

Ravi Basrur: కొలిమి నుంచి పాన్ ఇండియా లెవల్‌కు.. సాయం చేసిన వ్యక్తి పేరే తన పేరుగా
Untitled 1
Follow us on

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన మ్యూజిక్ తో సినిమా లెవల్ ను మరింత పెంచేస్తున్నారు. ఇంతకు ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో తెలిసిందా ఆయనే రవి బస్రుర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా రవి పేరు మారుమ్రోగింది. కన్నడ హీరో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడానికి రవి అందించిన సంగీతం కూడా ఒక కారణం, ముఖ్యంగా ఆయన హీరో ఎలివేషన్స్ లో ఇచ్చిన బీజీఎమ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. కేజీఎఫ్ 1,2 సినిమాలకు రవి బస్రుర్ సంగీతం అందించారు. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సంచలన విజయం సాధించిన సలార్ సినిమాకు కూడా రవి బస్రుర్ నే సంగీతం అందించారు. సలార్ దెబ్బకు రవి కోసం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. చాలా మంది స్టార్ హీరోలు ఆయనతో మ్యూజిక్ చేయించుకోవడం కోసం వెయిట్ చేస్తున్నారు.

తాజాగా రవి బస్రుర్ తన కెరీర్ జర్నీ గురించి తెలిపారు. ఇటీవల ఓ సింగింగ్ షోకు గెస్ట్ గా హాజరయ్యారు రవి బస్రుర్. ఆ షోలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. రవి బస్రుర్ తండ్రి ఊర్లో కొలిమి దగ్గర పని చేశేవారు. రవి బస్రుర్ కూడా తండ్రి దగ్గరే పని చేసేవారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఆయనకు ఆసక్తి ఉండేది. కానీ ఆర్ధిక పరిస్థితులుబాగోక కొలిమి దగ్గర పని చేసేవారట రవి.

సినిమాల పై ఉన్న ఆసక్తితో ఇంట్లో నుంచి వచేశారట. అప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. అప్పటికే మూడు రోజుల నుంచి తిండి తినలేదట.. కేవలం నీళ్లు మాత్రమే తాగేవారట. అయితే ఏ గుడిలో ఏ ఈరోజు ప్రసాదం పెడతారో ఓ లిస్ట్ రాసుకొని ఉంన్చుకున్నారట. ఓ రోజు ఆలస్యంగా వెళ్లడంతో ఆయనకు ప్రసాదం దొరకలేదట.  అప్పుడు ఓ పెద్దాయన నన్ను చూసి ఒక వ్యక్తి దగ్గరకు తీసుకువెళ్లి ఇతను బంగారపు పనులు చేస్తుంటాడు. కానీ సంగీతం అంటే పిచ్చి ఏదైనా పని ఇవ్వు అని చెప్పారు. దానితో అతను నను పనిలో పెట్టుకుంటా అన్నాడు. కానీ నేను వద్దు అని అన్నాను. మరి ఏం కావాలి అని అడిగారు కీబోర్డు కొనుకుంటా ..రూ. 35 వేలు కావాలి అని చెప్పాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా డబ్బులు ఇచ్చాడు. పని చేసి డబ్బులు ఇద్డువుగాని అని చెప్పాడు. అసలు పరిచయం కూడా లేని వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన పేరు రవి. అందుకే ఆయన పేరును నా పేరుగా పెట్టుకున్నా. ఆయన పేరు మా ఊరి పేరు కలిసి రవి బస్రుర్ అయ్యింది. నా అసలు పేరు కిరణ్.కానీ  రవి బస్రుర్ అని పిలిస్తేనే సంతోషిస్తా అని చెప్పుకొచ్చారు రవి బస్రుర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.