
బిగ్ బాస్ సీజన్ 10 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే 9 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 10కు రెడీ అయ్యింది. గత సీజన్స్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. సీజన్ 9 లానే ఈ సారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేయనున్నారు. సామాన్యులను హౌస్ లోకి పంపించి సెలబ్రెటీలతో పోటీకి దింపనున్నారు. దాంతో ఇప్పుడు బిగ్ బాస్ 10 కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 10కు కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. త్వరలోనే అగ్ని పరీక్ష 2 మొదలు కానుంది. దాంతో ఇప్పుడు చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నారు.
బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాలనుకునే వారు అప్లై చేసుకోవచ్చు అంటూ ఇటీవలే అనౌన్స్ చేశారు. సామాన్యులకు ఆఫర్ అని చెప్పడంతో చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికి చిత్రవిచిత్రమైన వీడియోలు చేస్తున్నారు. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో బాత్రూమ్స్ కడుగుతా అని కొంతమంది, హౌస్ లో వండిపెడతా అని మరికొంతమంది ఇలా చాలా రకాల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అనుకుంటున్నా.. నేను కూడా యాక్టింగ్ చేస్తా, ఏడుస్తా అని తెలిపింది. అవసరమైతే ఎక్స్‌పోజింగ్ కూడా చేస్తాను.. నా గోల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం.. ఎన్నో మాటలు అన్నారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి చూపించాలి అనుకుంటున్నా అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పేరు దివ్య శ్రీ. ఈ అమ్మడు ఓ మోడల్.. మోడలింగ్ లో పలు అవార్డులు అందుకుంది. దివ్యశ్రీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. నా ఓటు నీకే బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి