Unstoppable with NBK: అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్.. ఒకే స్టేజ్ పై బాలయ్య, చిరంజీవి.. ఈసారి పక్క అంటున్నారే..!

|

Aug 12, 2024 | 7:57 AM

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్’ షోతో తనలోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకువచ్చారు బాలయ్య. మునుపెన్నడూ చూడని విధంగా ఆ టాక్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు నటసింహం. అన్ స్టాపబుల్ షోకు ఇప్పటివరకు చాలా మంది యంగ్ హీరోలు, స్టార్ హీరోలు హాజరయ్యారు. కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్.. ఒకే స్టేజ్ పై బాలయ్య, చిరంజీవి.. ఈసారి పక్క అంటున్నారే..!
Balakrishna, Chiranjeevi
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు . తనదైన స్టైల్ లో యాక్షన్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు బాలకృష్ణ. తన నటన, తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ, టాక్ షో హోస్ట్ గాను అదరగొట్టారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్’ షోతో తనలోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకువచ్చారు బాలయ్య. మునుపెన్నడూ చూడని విధంగా ఆ టాక్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు నటసింహం. అన్ స్టాపబుల్ షోకు ఇప్పటివరకు చాలా మంది యంగ్ హీరోలు, స్టార్ హీరోలు హాజరయ్యారు. కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సరదాగా మాట్లాడుతూ.. సెలబ్రెటీల సీక్రెట్స్ బయట పెడుతూ బాలయ్య హోస్టింగ్ వారెవ్వా అనిపించింది.

ఇది కూడా చదవండి : OTT Movie : ఇదెక్కడి రచ్చ రా బాబు..! ఇద్దరమ్మాయిల మధ్య ఘాడమైన ప్రేమ.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇక ఈ షోకు చాలా మంది స్టార్ హీరోలు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా చాలా మంది ఈ టాక్ షోకు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో ఇప్పుడు సీజన్ 4కు సిద్ధం అవుతోంది. త్వరలోనే సీజన్ 4ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆహా అన్ స్టాపబుల్ సీజన్ 4 ను అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

ఇది కూడా చదవండి :  Naga Chaitanya : సమంతతో ఉన్న ఫోటోను పదిలంగా దాచుకున్న నాగ చైతన్య..

అయితే ఈసారి కూడా ఈ టాక్ షోకు సూపర్ సర్ ప్రైజ్ లు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈసారి ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.. అయితే ఈసారి బాలయ్య బాబు షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారని తెలుస్తోంది. గత మూడు సీజన్స్ నుంచి చిరంజీవి వస్తారని గుసగుసలు వినిపించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు అభిమానుల కల నెరవేరనుందని తెలుస్తోంది. ఇప్పుడు బాలయ్య షోకి మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారని తెలుస్తోంది. ఆయన అప్ కమింగ్ మూవీ విశ్వంభర మూవీ విశేషాలతో పాటు ఆయన లైఫ్ లోని ముఖ్యమైన విషయాలను కూడా పంచుకోనున్నారని అంటున్నారు. అలాగే ఇదే సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గెస్ట్‌గా హాజరవుతాడని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..