Sai Dharam Tej: ప్రమాదం తర్వాత తొలిసారి కెమెరా ముందు సాయి ధరమ్ తేజ్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. సెప్టెంబర్ 10న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు

Sai Dharam Tej: ప్రమాదం తర్వాత తొలిసారి కెమెరా ముందు సాయి ధరమ్ తేజ్.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్..
Megastar Chiranjeevi

Updated on: Nov 05, 2021 | 9:43 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. సెప్టెంబర్ 10న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మాదాపూర్‏లోని కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. బైక్ స్కిడ్ అయ్యి ప్రమాదానికి గురయ్యాడు తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన సాయి ధరమ్ తేజ్‏ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది… ఆ తర్వాత జూబ్లి హిల్స్‏లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తేజ్.. ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే తేజ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తేజ్ ఆరోగ్యం మెగాస్టార్ చిరంజీవి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. కోలుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ” అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ” అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్‏తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుతోపాటు..మెగా యంగ్ హీరోస్ అందరూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లుగా ఫోటో కనిపిస్తోంది.అలాగే పవర్ స్టార్ పవన్ తనయుడు అకిరా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తేజ్ వద్దకు వెళ్లినట్లుగా కనిపిస్తుంది.


ఇదిలా ఉంటే.. తేజ్… ఇక ఓ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లుగా టాక్. కొత్త దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్‌ చేస్తుండగా.. సుకుమార్ స్ర్కీన్ ప్లే అందించనున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం.

Also Read: Saami Saami Song: నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్.. పుష్పరాజ్, శ్రీవల్లి స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా..

Puneeth Raj Kumar: తండ్రిని కలిసిన పునీత్.. కన్నీరు పెట్టిస్తున్న అందమైన పెయింటింగ్.

Agent Movie: ఏజెంట్ సినిమా నుంచి మరో అప్డేట్.. అఖిల్ సరసన మరో అందాల భామ..

 

 

Follow Us