Chiranjeevi : చిరు లీక్స్.. ‘విశ్వంభర’ పై అదిరిపోయే హింట్ ఇచ్చిన మెగాస్టార్..
చివరిగా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వంభర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా చిరంజీవి భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో విశ్వంభర సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకు ముందు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అలాగే ఇప్పుడు విశ్వంభర సినిమా కూడా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు వశిష్ట. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి : రవితేజ పక్కన లవర్‌గా, వదిన నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర నుంచి చిరంజీవి లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ మెగాస్టార్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవీ తన సినిమాలకు ముందు మెగాస్టార్ చిరు లీక్స్ అంటూ కొన్ని హింట్స్ ఇస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. విశ్వంభర సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి : Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
రీసెంట్గా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఇండస్ట్రీ హిట్ ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.. సినిమా రీ రిలీజ్ లోనూ రికార్డ్ క్రియేట్ చేయడంతో ఇంద్ర చిత్ర బృందాన్ని చిరు తన ఇంటికి పిలిపించుకుని మరీ సన్మానించారు. సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ.. జన్మకి ఒక పాట అంటారు గదా ఇంద్ర మూవీకి తాను కంపోజ్ చేసిన ‘భం భం బోలే’ సాంగ్ అలాంటిది అని అన్నారు. వెంటనే చిరంజీవి మాట్లాడుతూ.. విశ్వంభర గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఇటీవల విశ్వంభర మ్యూజిక్ కోసం కీరవాణితో కలిసి బెంగుళూరు వెళ్ళాం.. విశ్వంభర సినిమాలో ఓ భక్తి పాట కావాలని.. అది ‘భం భం బోలే’ లాంటి సౌండింగ్, ఆ రేంజ్ వైబ్రెంట్ సాంగ్ అయి ఉండాలని దర్శకుడు వశిష్ఠ పట్టుబట్టారని తెలిపారు చిరు. అలాగే ఇస్తాను అని కీరవాణి అన్నారు. చెప్పినట్టుగానే రాములవారిమీద అద్బుతమైన సాంగ్ ఇచ్చారు. ఈ సాంగ్ త్వరలోనే చూడబోతున్నారు అని చిరంజీవి అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Chiru leaks 😅 Vishwambhara lo Bham Bham bole lanti ramudi song undhi anta kummude inka 🕺🕺🔥🔥#Vishwambhara pic.twitter.com/CgeVNhiqLN
— Ragnor Ravi (@scary_kiran) August 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.