AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వండిన చిరు

మెగాస్టార్ స్టెప్పేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వుద్ది. డైలాగ్ చెబితే కలెక్షన్ల రికార్డు మోగింది. మరి వంట చేస్తే..ఆహా..ఏం టేస్ట్ గురు అనాల్సిందే.

కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ వండిన చిరు
Ram Naramaneni
|

Updated on: Nov 01, 2020 | 10:26 PM

Share

మెగాస్టార్ స్టెప్పేస్తే బాక్సాఫీస్ బద్దలవ్వుద్ది. డైలాగ్ చెబితే కలెక్షన్ల రికార్డు మోగింది. మరి వంట చేస్తే..ఆహా..ఏం టేస్ట్ గురు అనాల్సిందే. అవును చిరంజీవి వంట చేయడంలో కూడా నైపుణ్యత సాధించారు. ఇటీవల తన తల్లి అంజనా దేవి కోసం చేపల పులుసు చేసి మైమరిపించారు. తాజాగా తన మనవరాళ్లకు కేఎఫ్​సీ స్టైల్​ చికెన్ రుచి చూపించారు చిరు.  ​తన మనవరాళ్లు సంహిత, నివ్రితిలతో కలిసి కేఎఫ్‌సీ స్టైల్‌ చికెన్‌ తయారు చేశారు. మనవరాళ్లు తన సహాయకులని, వారితో కలిసి వంట చేయడం చాలా ఆనందంగా అనిపించిందని చిరు చెప్పారు. అంతేకాదు వారితో కలిసి రోడ్డు పక్కన బండిపెట్టుకుని ‘కేఎఫ్‌సీ చికెన్‌..’ అమ్మేంతగా నిపుణులు అయ్యారని చెప్పుకొచ్చారు.

View this post on Instagram

It’s always fun to cook, even more so when your Assistants are such enthusiastic little kids! So let’s see how this pans out 🙂 Here it is .. #Samhita #Nivrithi

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) on

Also Read :

వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !

Follow Us