AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై మెగాస్టార్ ప్రశంసలు

టాలీవుడ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. అందమైన ప్రేమ కథలు, ఆకట్టుకునే కుటుంబ కథ చిత్రాలతో దూసుకుపోతున్నారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోగా ధనుష్ నటిస్తున్నాడు. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పై మెగాస్టార్ ప్రశంసలు
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 03, 2025 | 3:06 PM

Share

టాలీవుడ్ లో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అందమైన ప్రేమ కథలను ఆకట్టుకునే కుటుంబకథలను తెరకెక్కించడం లేదు శేఖర్ కమ్ముల దిట్ట. శేఖర్ కమ్ముల సినిమాలే కాదు ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకునే హీరోయిన్స్ కూడా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతారు. కుటుంబ కథలను అందంగా తెరకెక్కించి ప్రేక్షకులకు అందిస్తారు శేఖర్ కమ్ముల. ఈ టాలెంటడ్ దర్శకుడు ప్రస్తుతం ధనుష్ తో కలిసి ఓ భారీ ప్రజెక్టు చేస్తున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమాకు కుబేర అనే ఇంట్రస్టింట్ గైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఇటీవలే శేఖర్ కమ్ముల ఇండస్ట్రీలో 25 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్నారు. శేఖర్ కమ్ముల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శేఖర్ కమ్ములను స్పెషల్ గా అభినందించారు. సినిమాల్లో చిరంజీవి తన స్ఫూర్తి చేసి ఆయనతో సినిమా చేయాలనే కల ఉందని. ఇప్పుడు ఆయన తనను అభినందించడం ఎంతో సంతోషంగా ఉంది అని శేఖర్ కమ్ముల తెలిపారు. తాజాగా మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా శేఖర్ కమ్ములకు అభినందనులు తెలిపారు.ఈమేరకు ఆయన తన ఎక్స్ ఇలా రాసుకొచ్చారు..

” మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని వుండటం నాకూ అంతే ఆనందకరం. మీ ప్రస్థానానికి స్ఫూర్తి నిచ్చానని తెలిసి మరింత సంతోషించాను. మీ 25 years జర్నీలో ఆ విధంగా నేనూ ఒక భాగమైనందుకు గర్వంగా వుంది.సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్ ని జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిలిం మేకింగ్ లో మీ కంటూ ఒక ప్రత్యేక శైలిని క్రియేట్ చేసుకున్న మీరు ఇలాగే మరో 25 ఏళ్ళు మరెన్నో జనరంజకమైన సినిమాలు ‘వ్రాస్తూ’, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను” అంటూ మెగాస్టార్ రాసుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
గుండె వేగం, నిద్ర.. వెల్‌నెస్ బ్యాండ్ ప్రత్యేకతలు ఇవే
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అంకిత భకత్‌, కీర్తి, కుంకుమ్‌ దుమ్మురేపారు.. భారత్‌కు మరో గోల్డ్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అడ్వెంచర్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?
అల్ట్రా వయోలెట్ షాక్వేవ్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ ఎప్పుడు?