- Telugu News Entertainment Tollywood Meenakshi chaudhary latest red colour dress instagram photos goes viral on internet
Meenakshi Chaudhary: రెడ్ హాట్‌గా మెరిసిన మీనాక్షి.. కవితలు రాసేస్తున్న కుర్రకారు
మీనాక్షి చౌదరి.. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది.హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.
Updated on: Mar 19, 2025 | 1:57 PM

మీనాక్షి చౌదరి. సుశాంత్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించి మెప్పించింది. మాస్ పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించింది.

హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత అడివి శేష్ సరసన ‘హిట్-2’లో చేసింది. కెరీర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

కెరీర్ స్టార్టింగ్ లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం అందుకుంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో నటించి మెప్పించింది.

ఇవి కాక రీసెంట్ గా విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలు సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది. అలాగే కొన్ని తెలుగు సినిమాలను ఓకే చేసింది.

ఇక సోషల్ మీడియా ఈ బ్యూటీ పంచుకునే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. ఇలాంటి లవర్ మనకు రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. తన అందంతో అంతలా నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.





























