సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ మాత్రమే సరిపోదు.. కూసింత లక్ కూడా ఉండాలి. అలాగే రికమెండ్ చేసే మనుషులు కూడా కావాలి. లేకపోతే.. నేమ్ అండ్ ఫేమ్ రావడానికి టైం పడుతుంది. అందుకే చాలా ప్రతిభ ఉన్న నటీనటులు సైతం.. నిలదొక్కుకోడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. తొలుత చిన్న, చిన్న పాత్రలు చేసి.. ఇప్పుడు అగ్ర తారలుగా వెలుగొందుతున్నవారు తెలుగు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. జూనియర్ ఆర్టిస్టులు కనిపించన వాళ్లు సైతం ఇప్పుడు పెద్ద స్టార్స్ అయ్యారు. ఇక హీరోయిన్స్ కూడా చాలామంది తొలినాళ్లలో చిన్న చిన్న రోల్స్ వేసినవారే. అలానే తెలుగు చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్‌లో కనిపించిన ఓ అమ్మాయి.. ఇప్పుడు మంచి పాత్రలు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తనెవరో తెలుసకుందాం పదండి…
నాని హీరోగా నటించిన మజ్ను సినిమాలో అను ఇమాన్యూయేల్ హీరోయిన్ కథనాయికగా నటించిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాలో అనుకు ఫ్రెండ్‌గా నటించిన అమ్మాయి యూత్ అటెన్టన్ గ్రాబ్ చేసింది. తన పేరు బాంధవి శ్రీధర్. మజ్ను తరవాత మరికొన్ని సినిమాలలో కూడా బాంధవి యాక్ట్ చేసింది. అయితే ఏ సినిమాలో కూడా ఆమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కలేదు. అయితే మసూద సినిమా అమ్మడికి మరోసారి క్రేజ్ తెచ్చింది. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో నటించి అందర్ని భయపెట్టింది బాంధవినే. ప్రస్తుతం చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోన్న ఈ ముద్దు గుమ్మ.. మంచి పాత్రల కోసం వేచిచూస్తోంది. అయితే నెట్టింట మాత్రం మెస్మరైజ్ చేసే ఫోటోలతో అందాల జాతర చేస్తోంది.