Irumudi Song: రవితేజ ఇరుముడి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో

మాస్ మహరాజా రవితేజ తన పంథాకు భిన్నంగా నటిస్తోన్న చిత్రం 'ఇరుముడి'. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో 'అయ్యప్ప స్వామి' నేపథ్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'మల్లెపూల పల్లకి' సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Irumudi Song: రవితేజ ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చేసింది.. గూస్ బంప్స్ తెప్పిస్తోన్న లిరికల్ వీడియో
Irumudi Song

Updated on: Aug 16, 2026 | 9:05 PM

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇరుముడి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ రిలీజైన తర్వాత ఇరుముడి సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దీనిని కొనసాగిస్తూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి ‘ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం (ఆగస్టు16) రాత్రి ఇరుముడి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఈ వేడుకలోనే ఈ అయ్యప్ప స్వామి పాటను విడుదల చేశారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప స్వామి సాంగ్స్ స్పెషలిస్ట్ డప్పు శ్రీను ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. అలాగే చౌడం శ్రీనివాసరావు (వాసు) అందించిన సాహిత్యం పాటను ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక  ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అందించిన జానపద.. భక్తి శైలి స్టెప్పులకు రవితేజ తనదైన శైలి మాస్ గ్రేస్‌తో ప్రాణం పోశాడు. కొద్ది నిమిషాల క్రితమే రిలీజైన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా   భారీ వ్యూస్ రాబడుతోంది.

 

కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రవిజేత కూతురిగా నక్షత్ర అనే ఓ చిన్నారి నటిస్తోంది. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా  ఈ శుక్రవారం (ఆగస్టు 21)న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమతవుతోన్న రవితేజకు ఇరుముడి గ్రేట్ కమ్ బ్యాక్ మూవీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇరుముడి మల్లెపూల పల్లకి సాంగ్.. లిరికల్ వీడియో

ఇరుముడి సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us