అనవసరంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నా.. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా! నటి షాకింగ్ కామెంట్స్

చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి ఈ ముద్దుగుమ్మ, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి అనేక వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆమె తన మూడో వివాహ బంధం బ్రేక్ కావడానికి గల కారణాలను పంచుకుంది.

అనవసరంగా ముగ్గురిని పెళ్లి చేసుకున్నా.. నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా! నటి షాకింగ్ కామెంట్స్
Actress

Updated on: Nov 12, 2026 | 4:37 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు, విడకులు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎవరు ఎప్పుడు విడిపోతారో చెప్పడం చాలా కష్టం.. ఇదిలా ఉంటే ఓ నటి తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది ఆమె. ఆమె మరెవరో కాదు మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి మీరా వాసుదేవన్.  తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి అనేక వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది. అప్పట్లో ఆమె మూడు పెళ్లిళ్లకు సంబందించిన వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. మలయాళంలో ఆమె పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది మీరా వాసుదేవన్. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మీర.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె తన మూడో వివాహ బంధం బ్రేక్ కావడానికి గల కారణాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ నా మూడో భర్త నా కొడుకు పైన చూపిన ప్రేమ, శ్రద్ధ చూసి అతనితో ఈ బంధంలోకి అడుగుపెట్టా.. అతను నా కొడుకుకు మంచి తండ్రి అవుతాడని, నా కొడుకుకు ఒక మంచి తండ్రి దొరుకుతాడని ఫీలయ్యా చెప్పుకొచ్చింది.. అయితే, కాలక్రమేణా ఆమె అంచనాలు తప్పని తెలిశాయట. ఈ బంధం బ్రేక్ కావడానికి ప్రధాన కారణాలు తన భర్త మితిమీరిన ఆధారపడటం, అలాగే ఇద్దరి విలువల మధ్య తీవ్రమైన పొంతన లేకపోవడం అని మీరా స్పష్టం చేశారు.

భార్యను తల్లిగా చూసి, ప్రతి విషయంలోనూ స్పూన్-ఫీడింగ్ లాంటి ప్రొటక్షన్ చేసే పురుషులతో తాను ముందుకు వెళ్లలేనని ఆమె అన్నారు. అలాగే తన  పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ..  చాలా మందికి అది కేవలం గాసిప్ లా అనిపిస్తుంది, కానీ తనకు అది తన జీవితం అని మీరా ఎమోషనల్ గా తెలిపారు. సమాజం తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీ అని ముద్ర వేసినప్పుడు, తాను దానిని తట్టుకోగలిగాను తెలిపారు. అందుకు కారణం ఇతరులు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోకపోవడమేనని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇతరుల అభిప్రాయాలు తనను ప్రభావితం చేయవనే నమ్మడమే తనలో గొప్ప మార్పును తీసుకువచ్చిందని, ఆ మార్పుకు తన ఆలోచనా విధానమే కారణమని మీరా తెలిపింది. అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను జీవితంలో 17 సంవత్సరాలు వృధా చేశానని, మూడు అర్థం పర్థం లేని పెళ్లిళ్ల కు తన టైం ను కేటాయించానని తెలిపింది. ఈ సంవత్సరాల్లో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని, తనకు నచ్చిన పనులు చేయడం చేయాల్సింది.  సినిమా, ఫిట్‌నెస్, ఒక మంచి కమ్యూనిటీని సృష్టించడం, ఇతరులకు సేవ చేయడం వంటి వాటివి చేయాల్సింది. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపి ఉండాల్సిది. కొందరు వ్యక్తులతో సమయాన్ని వృధా చేసుకున్నానని.. బాల్య లైంగిక వేధింపుల బాధితురాలిగా తన జీవితం కష్టతరంగా సాగిందని మీరా వాసుదేవన్ చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us