AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan : విజయ్‌తో సినిమా ఛాన్స్.. త్రిష పంపిన ఆ మెసేజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మాళవికా మోహనన్

ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్న హీరోయిన్ మాళవిక మోహనన్. మలయాళం, తమిళం, హిందీ, కన్నడ మరియు తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు. రాజా సాబ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తాజాగా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

Malavika Mohanan : విజయ్‌తో సినిమా ఛాన్స్.. త్రిష పంపిన ఆ మెసేజ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. మాళవికా మోహనన్
Trisha
Rajitha Chanti
|

Updated on: Sep 08, 2026 | 2:14 PM

Share

కోలీవుడ్ దళపతి విజయ్ సరసన ‘మాస్టర్’ చిత్రంలో నటించి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మాళవికా మోహనన్. ఈ సినిమా విడుదలైన సమయంలో ఆమె నటనకు, అందానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా, ‘మాస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో సీనియర్ నటి త్రిష గురించి పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దళపతి విజయ్‌తో పనిచేయడం అనేది ఏ హీరోయిన్‌కైనా ఒక గొప్ప అనుభవమని, ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ , క్రేజ్ అపారమైనదని మాళవికా పేర్కొన్నారు. ‘మాస్టర్’ ప్రాజెక్ట్‌లోకి తాను ఎంపికైనప్పుడు చాలా సంతోషపడ్డానని, అలాగే అంత పెద్ద స్టార్ సరసన నటించేటప్పుడు కొంత ఒత్తిడి కూడా అనిపించిందని ఆమె తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

విజయ్‌తో సినిమా చేస్తున్నానని తెలిసిన వెంటనే నటి త్రిష తనకు స్వయంగా మెసేజ్ చేశారని మాళవికా గుర్తుచేసుకున్నారు. తమిళంలో విజయ్-త్రిష జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘కురువి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ అయిన త్రిష, మాళవికాకు మెసేజ్ చేస్తూ… “విజయ్‌తో పనిచేయడం నీకు ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సెట్స్‌లో ఆయన ఇచ్చే రెస్పెక్ట్, ప్రొఫెషనలిజం నిన్ను ఆకట్టుకుంటాయి. ఎంజాయ్ ది షూటింగ్” అని శుభాకాంక్షలు తెలిపారట.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

సహచరుడైన ఒక పెద్ద హీరోతో పనిచేస్తున్నప్పుడు తోటి హీరోయిన్ అంత సానుకూలంగా స్పందించి మెసేజ్ చేయడం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని మాళవికా ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ చాలా స్వీట్ పర్సన్ అని, సహనటులకు ఎంతగానో గౌరవం ఇస్తారని త్రిష చెప్పినట్లే, షూటింగ్ సమయంలో తనకు కూడా విజయ్ నుంచి అలాంటి గొప్ప సహకారం లభించిందని మాళవికా తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

Follow Us