Guntur Karam: ‘దమ్ మాసాలా’ ఆల్ టైమ్ రికార్డ్.. ఆ టాప్ లిస్ట్‏లో గుంటూరు కారం సాంగ్..

|

Nov 09, 2023 | 11:11 AM

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్, చరిష్మాకు తగినట్లుగా రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ తో రాసిన ఈ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ అందించారు. ఈ సాంగ్ అన్ని వర్గాల అడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా ఈ పాటలో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దమ్ మసాలా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఫస్ట్ డే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా నిలిచింది.

Guntur Karam: దమ్ మాసాలా ఆల్ టైమ్ రికార్డ్.. ఆ టాప్ లిస్ట్‏లో గుంటూరు కారం సాంగ్..
Dum Masala Song
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన దమ్ మసాలా సాంగ్ మ్యూజిక్ లవర్స్‏ను ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ క్రేజ్, చరిష్మాకు తగినట్లుగా రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ తో రాసిన ఈ పాటకు థమన్ అదిరిపోయే ట్యూన్ అందించారు. ఈ సాంగ్ అన్ని వర్గాల అడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా ఈ పాటలో మహేష్ లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు దమ్ మసాలా సాంగ్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 19.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాలీవుడ్ ఫస్ట్ డే అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా నిలిచింది.

ఇప్పటివరకు సౌత్ నుంచి వచ్చిన అన్ని హిట్ సాంగ్స్ లో 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న టాప్ పాటలలో మొదటి స్థానంలో బీస్ట్ మూవీ అరబిక్ కతు సాంగ్ ఉంది. ఈ పాట ఏకంగా 23.27 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అలాగే రెండో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం నుంచి విడుదలైన దమ్ మసాలా సాంగ్ నిలవడం విశేషం. ఈ పాట ఇప్పటివరకు 17.42 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. మూడో స్థానంలో విజయ్ వారిసు సినిమాలోని రంజితమే సాంగ్ 16.68 మిలియన్ వ్యూస్‏తో నిలిచింది. ఇక విజయ్ నటించిన లియో చిత్రంలోని నా రెడీ సాంగ్ 16.55 మిలియన్ వ్యూస్ తో నాలుగో స్థానంలో నిలిచింది. సర్కారు వారి పాట సినిమాలోని పెన్నీ సాంగ్ 16.38 మిలియన్ వ్యూస్ తో టాప్ 5 లోకి వచ్చింది. ఇవే కాకుండా కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ 6గా నిలిచింది. ఈ జాబితాలో మొత్తం టాప్ 6 సాంగ్స్ లో మూడు పాటలు మహేష్ బాబువి ఉండడం విశేషం.

ఇదిలా ఉంటే.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి12న రిలీజ్ కాబోతుంది. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో మహేష్ పూర్తిగా మాస్ లుక్ లో కనిపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.