Liger: చెన్నైలో సందడి చేసిన లైగర్ టీమ్.. విజయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే

|

Aug 13, 2022 | 6:35 PM

లైగర్(Liger) సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఎక్కడ తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు లైగర్ టీమ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..

Liger: చెన్నైలో సందడి చేసిన లైగర్ టీమ్.. విజయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే
Liger
Follow us on

లైగర్(Liger) సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు లైగర్ టీమ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటి రమ్యకృష్ణ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్, పూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ కు అనన్య పాండే టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవ్వనున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు లైగర్ టీమ్. ఇప్పటికే పలు గుజరాత్, ముంబై, పాట్నా లాంటి ప్రాంతాల్లో పర్యటించిన లైగర్ టీమ్ ఇప్పుడు చెన్నైలో సందడి చేస్తున్నారు. ఇక చెన్నైలో లైగర్ టీమ్ ను ఘనస్వాగతం పలికారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ కు కోలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో విజయ్ నోటా సినిమాతో తమిళ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అక్కడ కూడా మనోడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో లైగర్ ప్రమోషన్స్ కు వచ్చిన విజయ్ ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక విజయ్ మాట్లాడుతూ.. లైగర్ సినిమా ప్రేక్షకులు తప్పకుండా ఆస్వాదించే ఒక డెత్లీ మాస్ సినిమా అని అన్నారు. నోటా సినిమా రోజుల్లో తమిళంలో మాట్లాడటం చాలా బాగుండేది.  ఇప్పుడు మరోసారి చెన్నైకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక లైగర్ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి