Sridevi’s Birth Anniversary: అతిలోక సుందరి పుట్టిన రోజు..శ్రీదేవి మరణానికి కారణం ఇదేనా..!

|

Aug 13, 2024 | 10:03 AM

శ్రీదేవి చాలా స్లిమ్‌గా ఉండేది. మరణించినప్పుడు ఆమె వయస్సు 54 సంవత్సరాలు. శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు. శ్రీదేవి మరణానికి ఆమె కఠినమైన ఆహారం కారణంగానే అని కొందరు చేస్తున్నారు. 'శ్రీదేవి మరణం సాధారణ మరణం కాదు, ప్రమాదవశాత్తు జరిగిన మరణం.

Sridevi’s Birth Anniversary: అతిలోక సుందరి పుట్టిన రోజు..శ్రీదేవి మరణానికి కారణం ఇదేనా..!
Sridevi Birthday
Follow us on

అతిలోక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతను ఫిబ్రవరి 24, 2018 న మరణించారు. శ్రీదేవి మరణానికి గల అసలు కారణాన్ని బోనీకపూర్ గతంలోనే వెల్లడించారు. శ్రీదేవిని ఆమె కూతురు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. ఒక్కసారి శ్రీదేవి గురించిన విషయాలు ఓ సారి గుర్తు చేసుకుందాం.!

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

శ్రీదేవి చాలా స్లిమ్‌గా ఉండేది. మరణించినప్పుడు ఆమె వయస్సు 54 సంవత్సరాలు. శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందారు. శ్రీదేవి మరణంపై ఒక్కొక్కరు ఒక్కో రీజన్ చెబుతున్నారు. శ్రీదేవి మరణానికి ఆమె కఠినమైన ఆహారం కారణంగానే అని కొందరు చేస్తున్నారు. ‘శ్రీదేవి మరణం సాధారణ మరణం కాదు, ప్రమాదవశాత్తు జరిగిన మరణం. దీని గురించి నేను ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. ఎంక్వైరీ సమయంలో 24-48 గంటల పాటు దీని గురించి మాట్లాడాను. కాబట్టి.. దుబాయ్ పోలీసులు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు’ అని శ్రీదేవి భర్త బోనీ కపూర్ అన్నారు. క్లీన్‌చిట్‌ వచ్చినప్పటికీ శ్రీదేవి అభిమానులు బోనీ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ఇది కూడా చదవండి : ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

శ్రీదేవి గ్లామర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అదే ఆమెకు శాపంగా మారిందని అంటున్నారు. శ్రీదేవి భోజనంలో ఉప్పు ఉండదట. ఉప్పు లేని ఆహారం తక్కువగా తినవద్దని శ్రీదేవికి వైద్యులు వార్నింగ్ ఇచ్చారు. అయితే శ్రీదేవి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. శ్రీదేవి కొత్త సినిమా ప్రారంభించే సమయంలో డైట్‌లో ఉన్నారు. అందంగా కనిపించేందుకు ఆమె ఆహారంలో ఉప్పు తీసుకోలేదు’ అని బోనీ కపూర్ అన్నారు. ఉప్పు తినకపోవడం వల్ల శ్రీదేవికి బీపీ తగ్గింది. ఇదే శ్రీదేవి మరణానికి కారణం. అయినప్పటికీ, చాలామంది ఇప్పటికీ దీనిని నమ్మరు. దీని వెనుక బోనీ కపూర్ హస్తం ఉందని కొందరు అనుమానిస్తున్నారు.ఇంటికి వెళ్లినా, హోటల్‌కి వెళ్లినా శ్రీదేవి ఉప్పు లేని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఉండేది. అప్పుడు బోనీ కపూర్ ఆమెను ఉప్పు ఉన్న ఆహారం తినమని అడిగేవాడు. కానీ ఆమె మాట వినలేదట. శ్రీదేవి, బోనీ కపూర్‌ల వివాహం 1996లో జరిగింది. జాన్వీ 1997లో, ఖుషీ కపూర్ 2000లో జన్మించారు.

జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..