Bheemla Nayak: దీపావళి ముందే వచ్చేసింది.. లాలా భీమ్లా సాంగ్ ప్రోమో అదుర్స్ అంతే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.. మలయాళం సూపర్‌ హిట్ సినిమా అయ్యప్పనుమ్

Bheemla Nayak: దీపావళి ముందే వచ్చేసింది.. లాలా భీమ్లా సాంగ్ ప్రోమో అదుర్స్ అంతే...
Bheemla Nayak

Updated on: Nov 03, 2021 | 7:29 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్.. మలయాళం సూపర్‌ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియంకు తెలుగు రీమేక్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఇందులో పవన్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది.అలాగే రానా సరసన ఐశ్యర్యా రాజేష్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో పవర్ స్టార్ అభిమానులు భీమ్లా నాయక్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి లాలా భీమ్లా వీడియో ప్రోమో రిలీజ్ అయ్యింది.

ఇక తాజాగా విడుదలైన లాలా భీమ్లా వీడియో సాంగ్ ప్రోమో అదిరిపోయింది. అంతేకాకుండా.. విజువల్స్.. పవన్ లుక్ కేక పుట్టించాయి. నాగరాజు గారు హార్టీ కంగ్రాచ్చులేషన్స్ అండి.. మీకు దీపావళి పండుగ ముందే వచ్చేసిందండి హ్యాపీ దీపావళి అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి. ఇక ఇందులో పవన్ మాస్ లుక్‏లో అదరగొడుతున్నాడు.  ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.  సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.

వీడియో..

Also Read:  Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!