Acharya Movie: బ్యాలెన్స్ వర్క్ స్పీడప్ చేస్తున్న కొరటాల.. ఆగస్టు లో ఆచార్య వచ్చే అవకాశం..

| Edited By: Rajitha Chanti

Apr 28, 2021 | 10:23 AM

రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. అనే డైలాగ్ లో చిన్న స్పెల్లింగ్ కరెక్షన్ తప్ప లేదు మెగాస్టార్ చిరూకి. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అనేది ఆయనిస్తున్న మెగా భరోసా.

Acharya Movie: బ్యాలెన్స్ వర్క్ స్పీడప్ చేస్తున్న కొరటాల.. ఆగస్టు లో ఆచార్య వచ్చే అవకాశం..
Follow us on

Acharya Movie:

రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. అనే డైలాగ్ లో చిన్న స్పెల్లింగ్ కరెక్షన్ తప్ప లేదు మెగాస్టార్ చిరూకి. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అనేది ఆయనిస్తున్న మెగా భరోసా. అవును.. చిరూ మూవీ ఆచార్య రిలీజ్ డేట్ విషయంలో ఒక క్లారిటీకొచ్చేసింది కొరటాల క్యాంప్. మెగా స్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరుతోపాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, చరణ్ సరసన పూజాహెగ్డే నటిస్తుంది. చిరు చరణ్ ఇద్దరు ఆచార్య స్ సినిమాలో నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఆచార్య, నారప్ప, అఖండతో పాటు రవితేజ ఖిలాడీ కూడా మేనెలలోనే రావాల్సి వుంది. ఒకవైపు లాక్ డౌన్ డేస్ రిపీట్ అవుతున్నాయి మరోవైపు మే నెల ముంచుకొస్తోంది. ఆయినా చడీ చప్పుడు చేయకుండా వుండిపొయ్యారు మేకర్స్.  కానీ…కొరటాల మాత్రం.. బ్యాలెన్స్ వర్క్ స్పీడప్ చేస్తూనే రిలీజ్ డేట్ మీద కూడా ఒక నిర్ణయానికొచ్చేశారు.

కోవిడ్ చల్లబడేసరికి మరో మూడు నెలలు గ్యారంటీగా పట్టొచ్చన్నది ఒక అంచనా. అందుకే ఆగస్టులో రిలీజ్ కోసం ఆచార్య రెడీ అవుతున్నారట. ఇప్పటికే పుష్ప, ఎఫ్3 సినిమాలు ఆగస్టు మంత్ లో కర్చీపేసుకున్నాయి. అదే నెలలో ఓ మంచి గ్యాప్ కోసం వెతుకుతోందట టీమ్ ఆఫ్ ఆచార్య.

మరిన్ని ఇక్కడ చదవండి : 

నాని సినిమాకు బ్రేక్.. మేకర్స్‏కు షాకిచ్చిన హీరోయిన్.. ‘అంటే సుందరానికీ’ ప్యాకప్ చెప్పిన టీం..

Achor Shyamala: యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.. డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు..

Acharya Movie: మెగాస్టార్ సినిమాకు తప్పని కరోనా కష్టాలు.. వాయిదా పడిన ‘ఆచార్య’.. అఫిషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

Bandla Ganesh: మ‌ళ్లీ వెండి తెర‌పై క‌నిపించ‌నున్న బండ్ల గణేశ్‌.. అయితే ఈసారి ఏకంగా హీరోగా.? త‌మిళ రీమేక్‌లో..