Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు..

సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు చాలా వరకు ప్రతి సాంగ్ తెగ వైరలవుతుంది. అయితే కొత్త కొత్త సినిమా పాటలు.. ఫోక్ సాంగ్స్ కాకుండా దాదాపు దశాబ్దాల క్రితం విడుదలైన పలు ప్రేమ పాటలు సైతం ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా 90's యూత్ కు పిచ్చెక్కించిన సాంగ్స్ నెట్టింట క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సాంగ్ దాదాపు 22 ఏళ్లుగా యూట్యూబ్ లో దుమ్మురేపుతుంది.

Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు..
Manmadhuda Nee Kalaganna Song

Updated on: Jun 11, 2026 | 11:53 AM

తెలుగు సినిమా ప్రపంచంలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. కొన్ని తెరపై బ్లాక్ బస్టర్స్ కాగా.. మరికొన్ని మాత్రం అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాయి. అలాగే కొన్ని చిత్రాల్లోని పాటలు మాత్రం చాలా పాపులర్ అయ్యాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. దాదాపు 22 ఏళ్లుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ సాంగ్ ఏంటో మీకు తెలుసా.. ? టాలీవుడ్ రోమాంటిక్ థ్రిల్లర్ చిత్రాలలో ‘మన్మథ’ ఒక ట్రెండ్ సెట్టర్. శింబు, జ్యోతిక జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో యువతను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమా సాధించిన భారీ విజయంలో దీని మ్యూజిక్ ఆల్బమ్ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా, ఇప్పటికీ సంగీత ప్రియుల ప్లేలిస్ట్‌లో చోటు సంపాదించుకునే ఎవర్‌గ్రీన్ మెలోడీ సాంగ్ ‘మన్మథుడా నీ కలగన్నా’ (Manmadhuda Nee Kalaganna). తాజాగా యూట్యూబ్‌లో ఈ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతూ సామాజిక మాధ్యమాల్లో మళ్లీ ట్రెండ్ అవుతోంది.

యువన్ శంకర్ రాజా అందించిన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన ట్యూన్ ఈ పాటకు ప్రాణం పోశాయి. సంగీత సామ్రాజ్ఞి కె.ఎస్. చిత్ర (K.S. Chithra) తన మధురమైన గొంతుతో ఈ పాటను ఆలపించిన తీరు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రేమికురాలి మనసులోని భావాలను, తన కలల రాకుమారుడిపై ఉన్న అనురాగాన్ని ఈ పాటలో ఎంతో సున్నితంగా, అందంగా ఆవిష్కరించారు. దివంగత ప్రముఖ రచయిత వేటూరి సుందరరామమూర్తి అందించిన లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. “ఎందరినో నే చూశాగాని ఒక్కడే మన్మథుడు.. ఇరవై ఏళ్లుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు” అంటూ సాగే లైన్లు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

తెరపై శింబు, జ్యోతికల కెమిస్ట్రీ, జ్యోతిక అద్భుతమైన హావభావాలు ఈ పాటను విజువల్ వండర్‌గా మార్చాయి. ప్రస్తుతం రీల్స్, షార్ట్స్‌లలో ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విపరీతంగా వైరల్ అవుతుండటంతో ఈ సాంగ్ ఇప్పుడు మరోసారి యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కాలం మారినా, కొత్త పాటలు ఎన్ని వచ్చినా.. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ 2000ల నాటి మెలోడీ మ్యాజిక్ ఏమాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్ల రూపంలో కొనియాడుతున్నారు. లవ్, ఎమోషన్ కలగలిసిన ఈ సాంగ్ ఎప్పటికీ తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే ఒక అందమైన జ్ఞాపకం.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

ట్రెండింగ్ సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us